నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్

By Siva Kodati  |  First Published Feb 2, 2020, 7:48 PM IST

నిర్భయ కేసులో దోషుల ఉరిపై ట్రయల్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు దోషుల ఉరిని నిలిపివేయనున్నారు. 


నిర్భయ కేసులో దోషుల ఉరిపై ట్రయల్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు అందే వరకు దోషుల ఉరిని నిలిపివేయనున్నారు.

Also Read:నిర్భయ కేసు దోషుల ఉరితీతపై స్టే: హైకోర్టులో సవాల్ చేసిన కేంద్రం

Latest Videos

undefined

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు.

నలుగురు దోషులు వరుసగా పిటిషన్లు వేస్తూ దేశం యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారని.. నిర్భయపై అమానవీయంగా వ్యవహరించిన తీరు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. పవన్ గుప్తా అనే దోషి ఇప్పటి వరకు క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని, కావాలనే ఆలస్యం చేస్తున్నాడని తుషార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు స్టే ఇవ్వడంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ, తీహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష అమలు కాకుండా దోషులు ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కేంద్రం పిటిషన్‌లో పేర్కొంది.

Also Read:నిర్భయ కేసు దోషుల మరో ఎత్తు: రాష్ట్రపతికి అక్షయ్ ఠాకూర్ మెర్సీ పిటిషన్

నిర్భయ దోషుల చేతిలో చట్టం దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడింది. శిక్ష నుంచి తప్పించుకుంటే పోత ఉరిశిక్షను వాయిదా వేస్తూ పోతే ఎప్పటికీ శిక్ష అమలు కాదని హోంశాఖ ఆవేదన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి పిటిషన్లు వేస్తూ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడింది. 

click me!