జార్ఖండ్ రాష్ట్రంలో భార్య పిల్లలను కానిస్టేబుల్ హత్య చేశాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
బ్రిజేష్ తివారీ రాంచీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాంచీలో ఓ అద్దె ఇంట్లో ఆయన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం నాడు బ్రిజేష్ తివారీ మద్యం తాగి వచ్చాడు.భార్యతో పాటు ఇద్దరు పిల్లలను ఆయన కొట్టి చంపాడు.
undefined
భార్యతో పాటు కొడుకు, కూతురును సుత్తితో కొట్టి, పొడిచి చంపాడు కానిస్టేబుల్. అనంతరం పండారాలో నివాసం ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి ఆ ముగ్గురిని చంపేసినట్టుగా ఫోన్ చేశాడు. సోదరికి ఫోన్ చేసిన తర్వాత తాను కూడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
బ్రిజేష్ ఫోన్ చేయడంతో ఆమె సోదరి వెంటనే అక్కడికి చేరుకొంది. అప్పటికే బ్రిజేష్ భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. బ్రిజేష్ మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వెంటనే ఆమె స్థానికుల సహాయంతో బ్రిజేష్ ను ఆసుపత్రికి తరలించారు.
తివారీ కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి తివారీ ఆమెను చంపి ఉంటారని ఆరోపిస్తున్నారు.సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.