అరగంటపాటు అక్రమంగా ఓ వ్యక్తిని లాకప్‌లో వేశారు.. పోలీసులకు రూ. 50 వేల ఫైన్ వేసిన హైకోర్టు

By Mahesh K  |  First Published Oct 6, 2023, 7:20 PM IST

ఢిల్లీలో ఓ కూరగాయల విక్రేతను పోలీసులు అక్రమంగా లాకప్‌లో అరగంటపాటు నిర్బంధించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పోలీసులకు మొట్టికాయలు వేసింది. పిటిషనర్ స్వేచ్ఛను హరించారని, చట్ట ప్రకారం నడుచుకోలేదని తెలిపింది. రూ. 50 వేల ఫైన్ వేసింది.
 


న్యూఢిల్లీ: కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తిని పోలీసులు అక్రమంగా లాకప్‌లో వేశారు. ఎఫ్ఐఆర్ లేదు, అరెస్టూ చేయలేదు. అరగంటపాటు లాకప్‌లో అక్రమంగా బంధించి వదిలిపెట్టారు. కానీ, ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని వాదించడంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. పోలీసులూ చట్టానికి అతీతులు కాదని తెలిపింది. పోలీసుల తీరు చట్టబద్ధంగా లేదని వివరించింది. పోలీసులకు రూ. 50 వేల జరిమానా విధించింది.

ఢిల్లీలో ఓ కూరగాయల వ్యాపారికి, ఓ మహిళకు గతేడాది సెప్టెంబర్‌లో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్లి ఆ వ్యక్తిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరగంటపాటు లాకప్‌లో బంధించి విడిచి పెట్టారు. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

Latest Videos

Also Read: ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు వార్నింగ్.. అసభ్య పోస్టులను ఉపేక్షించం: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

జస్టిస్ సుబ్రమణ్యన్ ప్రసాద్ ఈ కేసు విచారించి పోలీసులకు మొట్టికాయలు వేశారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళనకరం అని, అకారణంగా లాకప్‌లో పెట్టారని పేర్కొన్నారు. పోలీసులు పిటిషనర్ స్వేచ్ఛను హరించారని, వారి తీరును సమర్థించలేమని అన్నారు. అందుకే పిటిషనర్‌కు పోలీసులు రూ. 50 వేలు పరిహారం అందించాలని, ఆ రూ. 50 వేలు సదరు ఇద్దరు పోలీసు అధికారుల జీతాల నుంచి చెల్లించాలని ఆదేశించారు.

click me!