
న్యూఢిల్లీ: మహిళా కానిస్టేబుల్‌ను ఓ హెడ్ కానిస్టేబుల్ హతమార్చాడు. హతమార్చి డెడ్ బాడీని ఓ డ్రైన్‌లో దాచి పెట్టాడు. రెండేళ్ల తర్వాత ఈ కేసును క్రైం బ్రాంచీ ఛేదించింది. హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసింది.
ఢిల్లీ పోలీసు శాఖలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర, మహిళా కానిస్టేబుల్ రుచికకు పరిచయం ఏర్పడింది. సన్నిహిత సంబందం ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని రుచిక తరుచూ సురేంద్రను ఒత్తిడి చేసేంది. కానీ, సురేంద్ర అందుకు సుముఖంగా స్పందించేవాడు కాదు.
సురేంద్రకు అప్పటికే పెళ్లి జరిగింది. కాబట్టి, రుచికను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో లేడు. కానీ, తరుచూ పెళ్లి చేసుకోవాలని రుచిక ఒత్తిడి చేయడంపై ఆగ్రహించేవాడు. ఓ రోజు రుచికను చంపేశాడు. రెండేళ్ల తర్వాత ఈ కేసు సాల్వ్ అయింది. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రైం బ్రాంచీ పోలీసులు రుచిక డెడ్ బాడీని వెలికి తీశారు. ఆ డెడ్ బాడీ అస్థిపంజరంగా మారిపోయింది.
Also Read: పాకిస్తాన్‌లోని జంట పేలుళ్ల వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ హస్తం ఉన్నదని పాకిస్తాన్ ఆరోపణలు
పోలీసు వర్గాల ప్రకారం, నిందితుడు తరుచూ తనతో కాల్ గర్ల్స్‌ను వేరే వేరే నగరాలకు తీసుకెళ్లేవాడు. ఇలా వెళ్లినప్పుడు మరో చోట రుచికకు సంబంధించిన డాక్యుమెంట్లను హెడ్ కానిస్టేబుల్ మరిచిపోయాడు.
దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఇష్టపూర్వకంగానే మళ్లీ కుటుంబం వద్దకు తిరిగి రావాలనే ఉద్దేశం ఏమీ పెట్టుకోకుండా హెడ్ కానిస్టేబుల్ సురేంద్ర వద్దకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు.