వివాదాస్పద సర్క్యులర్: వెనక్కి తీసుకొన్న ఢిల్లీ ఆసుపత్రి

By narsimha lodeFirst Published Jun 6, 2021, 4:30 PM IST
Highlights

కేరళకు చెందిన నర్సులు మళయాళంలో మాట్లాడొద్దని ఢిల్లీకి చెందిన గోవింద్ వల్లబ్ పంత్ ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించుకొంది. ఈ విషయాన్ని ఆసుపత్రి  మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ అగర్వాల్ ఆదివారం నాడు ప్రకటించారు.

న్యూఢిల్లీ: కేరళకు చెందిన నర్సులు మళయాళంలో మాట్లాడొద్దని ఢిల్లీకి చెందిన గోవింద్ వల్లబ్ పంత్ ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించుకొంది. ఈ విషయాన్ని ఆసుపత్రి  మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ అగర్వాల్ ఆదివారం నాడు ప్రకటించారు.ఈ ఆసుపత్రిలో పనిచేసే కేరళకు చెందిన నర్సులు మళయాళంలో కాకుండా హిందీ, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని శనివారం నాడు నర్సింగ్ సూపరింటెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులపై మళయాళీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయమై వస్తున్న వ్యతిరేకతతో ఈ ఉత్తర్వులను  ఉపసంహరించుకొంటున్నట్టుగా ఆసుపత్రి సూపరింటెండ్ ఆదివారం నాడు ప్రకటించారు. 

also read:కేరళ నర్సులకు ఢిల్లీ ఆసుపత్రి ఆదేశాలపై వివాదం: మళయాళీల ఆగ్రహం

సహోద్యోగులతో పాటు రోగులకు ఈ భాష తెలియనందున కమ్యూనికేషన్ కోసం హిందీ, ఇంగ్లీష్ భాషను ఉపయోగించాలని కోరామాని ఆసుపత్రి ప్రకటించింది.  డాక్టర్ అగర్వాల్ ఇవాళ ఈ ఉత్తర్వును ఉపసంహరించుకొంటున్నట్టుగా ప్రకటించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తనకు తెలియదన్నారు. నర్సింగ్ సిబ్బందిలో అంతర్గత సమాచార మార్పిడి ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. తమ మాతృభాషలో మాట్లాడుకోవడం వారి ప్రాథమిక హక్కన్నారు. ఈ విషయమై ఎలాంటి ఆర్ధర్ ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

బీజేపీ విమర్శలు

గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రిలో కేరళకు చెందిన నర్సులు మళయాళంలో మాట్లాడొద్దని ఉత్తర్వులు జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని కోరడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. రాజ్యాంగ పరంగా ప్రజలకు సంక్రమించిన హక్కులను కూడ కాలరాయడమేనని బీజేపీ  నేత టామ్ వడక్కన్ అభిప్రాయపడ్డారు.

ఆక్సిజన్ అవసరమైన సమయంలో కేరళ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నర్సులు మళయాళంలో మాట్లాడొద్దని కోరడం సహేతుకం కాదన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది నర్సింగ్ స్టాఫ్ కేరళ రాష్ట్రానికి చెందినవారేనని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ రోగులకు చికిత్స చేస్తూ నర్సులు, వైద్య సిబ్బంది మరణించారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై కేరళ ప్రభుత్వం నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.

రాహుల్ స్పందన
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధఈ తీవ్రంగా స్పందించారు. మళయాళం ఇండియన్ భాష అని ఆయన గుర్తు చేశారు. భాషలపై వివక్షను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. .  అదే పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్, కేసీ వేణుగోపాల్ కూడ తీవ్రంగా ఖండించారు.

click me!