కేరళ నర్సులకు ఢిల్లీ ఆసుపత్రి ఆదేశాలపై వివాదం: మళయాళీల ఆగ్రహం

By narsimha lodeFirst Published Jun 6, 2021, 12:04 PM IST
Highlights

ఢిల్లీకి చెందిన ఓ ఆసుపత్రి యాజమాన్యం కేరళ నర్సులకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. 
ఆసుపత్రిలో పనిచేసే సమయంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మాట్లాడాలని ఆదేశాలు జారీచేసింది

న్యూఁఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఓ ఆసుపత్రి యాజమాన్యం కేరళ నర్సులకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. ఆసుపత్రిలో పనిచేసే సమయంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మాట్లాడాలని ఆదేశాలు జారీచేసింది..ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయమై నెటిజన్లు మండిపడుతున్నారు కరోనా రోగులకు సేవ చేయడంలో నర్సుల పాత్ర కీలకమైంది. దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన నర్సులు  దే, విదేశాల్లోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.   అంకిత భావంతో సేవలందించే కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 మలయాళంలో మాట్లాడొద్దంటూ కేరళకు చెందిన నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రిలో ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్  ఆదేశాలు జారీ చేసింది.ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు, సహచర ఉద్యోగుల్లో ఎక్కువ మందికి మలయాళం అర్థంకాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోందని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.దీనికి సంబందించి తమకు ఓ ఫిర్యాదు అందినట్లు ఆ ఆసుపత్రి  తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుని అందరూ ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

click me!