భార్య, పిల్లలకు విషం పెట్టి.. వ్యక్తి ఆత్మహత్య.!

Published : Dec 01, 2021, 09:38 AM IST
భార్య, పిల్లలకు విషం పెట్టి.. వ్యక్తి ఆత్మహత్య.!

సారాంశం

 కాగా.. ఇంట్లో  ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు  చెబుతున్నారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగానే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ఆ భార్యభర్తల మధ్య మనస్పర్థలు  చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని సమయపూరీ బాడ్లీ బ్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య పాల్పడింది. కాగా.. ఇంట్లో  ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు  చెబుతున్నారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగానే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Also Read: ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్(30) నిక్కీ(27) ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల వయసుకున్న కుమార్తె, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా.. అమిత్ కుమార్ కజిన్ సౌరబ్... మంగళవారం ఉదయం.. వారికి ఇంటికి వెళ్లాడు. అయితే.. లోపలి నుంచి.. డోర్ లాక్ వేసినట్లు గుర్తించారు. ఎంత సేపు డోర్ కొట్టినా.. వారు తెరవకపోవడం గమనార్హం.

అనుమానం వచ్చి.. సౌరబ్ వెంటనే తన తండ్రికి సమాచారం అందించాడు. ఇద్దరూ కలిసి.. డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. నలుగురు శవాలై కనిపించారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Also Read: ఆ రోజు మీరేం చేశారో నాకు తెలుసు.. క్షమాపణలు చెబితేనే : 12 ఎంపీల సస్పెన్షన్‌పై పీయూష్ గోయెల్

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అమిత్ సీలింగ్ కి ఉరివేసుకొని కనిపించాడు. మిగిలిన ముగ్గురు విషం తీసుకోవడం వల్ల చనిపోయినట్లు కనపడింది.  అమిత్.. ఆ ముగ్గురికి  విషం ఇచ్చి.. ఆ తర్వాత తాను.. ఉరి వేసుకన్నాడని పోలీసులు భావిస్తున్నారు. నలుగురు మృతదేహాలను శవ పరీక్ష నమిత్తం.. ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య భర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని తమకు తెలుసని.. కానీ.. ఇలా చనిపోయేంత వరకు ఉన్నాయనే విషయం తమకు తెలీదని.. బంధువులు చెప్పడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్