ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

Published : Feb 08, 2020, 06:35 PM ISTUpdated : Feb 08, 2020, 06:57 PM IST
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్:  ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

సారాంశం

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది  

ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.

also read  ఢిల్లీ ఎగ్జిట్ పోల్: మరోసారి ఊడ్చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ... కుండబద్దలుకొట్టిన రిపబ్లిక్- జన్ కి బాత్ సర్వే

పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హోరు మొదలయింది. ఇప్పుడే విడుదలైన న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ కేజ్రీవాల్ దే ఆధిక్యత అని తేల్చింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తేల్చి చెబుతున్నాయి.  

ఆప్ 53 నుంచి 57 సీట్లను గెలుచుకుంటుందని,  బిజెపి11 నుంచి 16 సీట్లను గెలుస్తుందని, కాంగ్రెస్ 0-2 సీట్లకు పరిమితమవ్వొచ్చని తెలిపింది. 

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్: హస్తిన మళ్ళీ ఆప్ హస్తగతం... స్పష్టం చేసిన టైమ్స్ నౌ

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆప్ గెలిస్తే మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. బిజెపి తన సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెసు 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది.

ఢిల్లీలో మొత్తం 13,571 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. లక్షా 24 మంది పోలింగ్ విధులు నిర్వహిచారు. ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,86,382 మంది ఉండగా అందులో మహిళలు 66 లక్షల 80 వేల 277 మంది, పురుషులు 81 వేల 5 వేల 236 మంది ఉన్నారు.

also read ఢిల్లీ ఎగ్జిట్ పోల్: సిఎన్ఎన్- న్యూస్ 18 సర్వే... తిరిగి మరో సారి ముఖ్యమంత్రి కానున్న కేజ్రీవాల్

2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బిజెపి 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెసు పార్టీ ఖాతానే తెరవలేదు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu