ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: తగ్గిన ఓటింగ్ శాతం

By telugu teamFirst Published Feb 8, 2020, 6:06 PM IST
Highlights

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2015లో కన్నా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో 67 శాతం ఓట్లు నమోదు కాగా, ప్రస్తుత ఎన్నికల్లో 60 శాతానికి మించి పోలయ్యే సూచనలు లేవు. శనివారం ఆరు గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తుండడంతో ఓటింగ్ కాస్తా పెరిగే అవకాశం ఉంది. 2015లో 67 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఆప్ గెలిస్తే మరో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. బిజెపి తన సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెసు 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 

also read   ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో మరోసారి సర్కారును ఏర్పాటు చేయనున్న కేజ్రీవాల్...న్యూస్ ఎక్స్ సర్వే

ఢిల్లీలో మొత్తం 13,571 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. లక్షా 24 మంది పోలింగ్ విధులు నిర్వహిచారు. ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,86,382 మంది ఉండగా అందులో మహిళలు 66 లక్షల 80 వేల 277 మంది, పురుషులు 81 వేల 5 వేల 236 మంది ఉన్నారు. 

2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బిజెపి 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెసు పార్టీ ఖాతానే తెరవలేదు.

click me!