మూడోసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్... ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు

Published : Feb 11, 2020, 12:55 PM IST
మూడోసారి ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్... ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు

సారాంశం

అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పుడు అభినందనల జల్లు కురుస్తోంది. మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచినందుకు కేజ్రీవాల్ కి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు అభినందనలు తెలియజేశారు. ఫోన్ చేసి మరీ అభినందించారు.

ఢిల్లీలో ఆప్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది.  గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కాస్త పుంజుకున్నప్పటికీ.. పెద్దగా ప్రాబల్యం చూపలేదు.

ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడం కూడా వృథా. కనీసం బోనీ కూడా కట్టలేదు. ఒకప్పుడు దశాబ్దకాలంపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కి కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడం గమనార్హం.

Also Read ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: థాంక్యూ ఢిల్లీ అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్...

ఇదిలా ఉంటే... అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పుడు అభినందనల జల్లు కురుస్తోంది. మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచినందుకు కేజ్రీవాల్ కి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు అభినందనలు తెలియజేశారు. ఫోన్ చేసి మరీ అభినందించారు.

ఇదిలా ఉంటే.. ఆప్ విజయంపై ప్రశాంత్ కిశోర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ ఆప్ ని గెలిపించి దేశ ఆత్మను ఢిల్లీ ప్రజలు కాపాడారని.. వారికి తాను దన్యవాదాలు తెలియజేస్తున్నాను’’  అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System