న్యూఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు 2020: గతం కంటే మెరుగైన బీజేపీ

By narsimha lodeFirst Published Feb 11, 2020, 12:44 PM IST
Highlights

గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు బీజేపీ సాధించే అవకాశాలు ఉన్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లు మత్రమే ఉన్నాయి. ఈ దఫా  ఆ పార్టీ రెండంకెల సీట్లను సాధించే అవకాశం ఉందని ట్రెండ్స్ చూస్తే అర్ధమౌతోంది.


న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  గతంతో పోలిస్తే ఈ దఫా మెరుగైన సీట్లను సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాలతోనే ఆ పార్టీ సరిపెట్టుకొంది.

దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని  బీజేపీ చేసిన ప్రయత్నాలకు ఓటర్లు గండికొట్టారు. గతంతో పోలిస్తే  ఈ దఫా బీజేపీకి ఓటింగ్ శాతంతో పాటు సీట్ల శాతం కూడ పెరిగే అవకాశం ఉంది.

గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్ ఆప్ దక్కించుకొంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే  కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చిన  ఓట్ల కంటే ఆరు శాతం ఓటింగ్ శాతం కోల్పొయింది.

Also read:ఢిల్లీ ఫలితాలు 2020: ఉల్లి దెబ్బకు నాడు బీజేపీ విలవిల, నేడు ఆప్‌ ఎస్కేప్

 అయితే బీజేపీ మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 50 శాతానికి కంటే ఎక్కువగా  ఓట్లు వచ్చాయి. 

కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి 45 శాతానికి పడిపోయింది. అయితే తుది ఫలితాలు వచ్చేసరికి  ఈ ఓట్ల శాతం తేడాలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ అభ్యర్థులు 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

click me!