
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. మార్చి 4వ తేదీ వరకు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి జడ్జీ ఎంకే నాగ్‌పాల్ అంగీకరించారు. ఐదు రోజుల సీబీఐ కస్టడీని మంజూరు చేస్తూ ఆయన తీర్పు ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ నిన్న మనీశ్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఎనిమిది గంటలపాటు ప్రశ్నలు కురిపించింది. ఆ తర్వాత అతడిని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు అతడిని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచించింది.
నిన్నటి విచారణలో మనీశ్ సిసోడియా సహకరించలేదని, అందుకే సిసోడియాను ప్రశ్నించడానికి మరికొంత సమయం కావాలని కోర్టులో సీబీఐ వాదించింది. ఈ కుట్రను నేర్పుగా పక్కా ప్లాన్‌తో సీక్రెట్‌గా రూపొందించారని ఆరోపించింది.
Also Read: సిసోడియా అరెస్టు సీబీఐ అధికారులకు కూడా ఇష్టం లేదు.. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల తప్పలేదు - కేజ్రీవాల్
సీబీఐ వాదనలను సిసోడియా న్యాయవాది వ్యతిరే కించారు. ఒకరు ఏమీ చెప్ప ట్లేదని కారణం చూపి అరెస్టును కోరలేమని వాదించారు. 2022 ఆగస్టు 9వ తేదీన సిసోడియా ఇంటిలో రైడ్ జరిగిందని, ఆయన తన ఫోన్ ను హ్యాండోవర్ చేశారని సిసోడియా కౌన్సెల్ డాయన్ క్రిష్ణన్ తెలిపారు. ఈ విచార ణలో పాల్గొనాలని తనను కోరారని, అందుకు సిసోడియా సహక రించారు కూడా అని వివరించారు.