భార్యను వదిలేయాలని భర్తకు బెదిరింపులు.. పెళ్లికి నిరాకరించిందని అతని భార్య హత్య.. ఢిల్లీలో ఓ వివాహితుడి దారుణం

By Mahesh KFirst Published Mar 25, 2023, 8:03 PM IST
Highlights

ఢిల్లీలో ఓ వివాహితుడు, నలుగురు పిల్లలకు తండ్రైన ఓ క్యాబ్ డ్రైవర్ మరో వ్యక్తి భార్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కొన్ని రోజులుగా పెళ్లికి ఒప్పుకోవాలని బలవంతపెట్టాడు. ఆమె తిరస్కరించడంతో హత్య చేశాడు.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఓ వ్యక్తి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలకు తండ్రి. కానీ, మరో వ్యక్తి భార్యను పెళ్లి చేసుకోవాలనే కుటిలత్వానికి దిగజారాడు. ఆమె భర్తకు ఫోన్ చేసి భార్యను విడిచి పెట్టాలని బెదిరించాడు. ఆ వివాహిత పెళ్లికి నిరాకరించడంతో ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

34 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ వేరే వ్యక్తి భార్య ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచాడు. ఆమె నిరాకరించడంతో చంపేశాడు. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. బిహార్‌లోని మదుబానికి చెందిన శివ్ శంకర్ ముఖియాగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఢిల్లీలోని చిరాగ్ ఏరియాలో ప్రస్తుతం భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతని భార్య ఇంటి పనిమనిషిగా చేస్తున్నది.

పోస్టు మార్టం నివేదికలో మృతురాలి తలకు తీవ్ర గాయాలు ఉన్నాయని తేలింది. ఆమె నోటిలోనూ గాయాలు ఉన్నాయని, అవి బహుశా ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను తెస్తున్నాయని ఓ అధికారి తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో మృతురాలి ఫ్రెండ్.. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినట్టు పోలీసులకు వివరించింది. సీసీటీవీ ఫుటేజీలో ఓ అనుమానాస్పద వ్యక్తి ఆ లేన్‌లోకి రాత్రి 7.13 గంటలకు వచ్చి 7.27 గంటలకు వెళ్లిపోయినట్టుగా కనిపించిందని పోలీసులు తెలిపారు. 

Also Read: ‘అలా బతికే బదులు చావడానికైనా సిద్ధమే’.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్..

ఓ నెల క్రితం తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని, అందులో భార్యను విడిచి పెట్టాలని కాలర్ తనను బెదిరించినట్టు మృతురాలి భర్త పోలీసులకు తెలిపాడు. కాల్ డీటెయిల్స్ చూసిన తర్వాత నిందితుడు ముఖియాను అరెస్టు చేసినట్టు డీసీపీ అమృత గుగులోత్ వివరించారు. 

మృతురాలికి ముఖియాకు మూడేళ్ల క్రితం ఓ మ్యూచువల్ ఫ్రెండ్‌తో నోయిడాలో పరిచయం జరిగిందని, అప్పటి నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడని పోలీసులు తెలిపారు. కానీ, ఆమె తిరస్కరిస్తూనే వస్తున్నదని వివరించారు. ముఖియా ఆమె ఇంటికి వెళ్లి కొట్టడం మొదలు పెట్టాడని, ఆమె అరుపులు వేయడంతో కోపంలో చంపేశాడని పోలీసులు తెలిపారు.

click me!