బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కు బెదిరింపులు:విచారణ చేస్తున్న పోలీసులు

By narsimha lodeFirst Published Nov 28, 2021, 1:13 PM IST
Highlights


బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. పాకిస్తాన్ నుండి ఈ మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై గౌతం గంభీర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కు  బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పాకిస్తాన్ నుండి ఈ మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటీవలనే గౌతం గంభీర్ ను చంపుతామని బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు Gautam Gambhir కు  isis Kashmir  అనే ఈ మెయిల్  ఐడీ నుండి బెదిరింపు మెయిల్ వచ్చింది.  ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.  ఇవాళ తెల్లవారుజామున  1:37 గంటలకు  మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.  

గతంలో  కూడా గౌతం గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి.  ఈ బెదిరింపుల నేపథ్యంలో police గౌతం గంబీర్  ఇంటి వద్ద భద్రతను పెంచారు. గంభీర్ ఇంటి వైపు వెళ్లే  ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.   అయితే తాజాగా మరోసారి బెదిరింపులు రావడంతో  పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కు ఐసీస్ కాశ్మీర్ నుండి మూడోసారి  బెదిరింపులు వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని పోలీస్‌‌లోని ఉగ్రవాద సంస్థ గూఢచారులు మాజీ క్రికెటర్ పై నిఘా ఉంచారని బెదిరింపులో పేర్కొన్నారు.

also read:ఆ విషయాన్ని పంత్ అర్థం చేసుకోవాలి: గౌతం గంభీర్ సలహా

గత వారం ఐసీఎస్ కాశ్మీర్ అని చెప్పుకొనే వ్యక్తులు లేదా సంస్థ నుండి తనకు ప్రాణహాని ఉందని గౌతం గంభీర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్ను నీ కుటుంబాన్ని చంపబోతున్నామని ఆ మెయిల్ లో  బెదిరించారు.  మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రేమిస్తున్నట్టైతే రాజకీయాలకు కాశ్మీర్ సమస్యకు దూరంగా ఉండాలని ఆ మెయిల్ లో ఉందని పోలీసులు తెలిపారు.ఈ మెయిల్ ‌గురించి  గూగుల్ ను పూర్తి వివరాలు ఇవ్వాలని  సమాచారం కోరారు ఢిల్లీ  పోలీసులు.  గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారంగా పాకిస్తాన్ నుండి  వచ్చినట్టుగా ఉందని  పోలీసులు గుర్తించారు. బుధవారం నాడు కూడా  ఈ మెయిల్ ఐడీ నుండి  బెదిరింపు అందింది. దీంతో  ఈ మెయిల్ తో పాటు గంబీర్ నివాసానికి చెందిన వీడియో ను కూడా జత చేశారు. 

click me!