Delhi pollution: దీపావళికి బాణసంచా కాల్చడంతో భారీగా గాలి కాలుష్యం ఏర్పడిన తర్వాత న్యూఢిల్లీతో కలిసి ముంబయి, కోల్ కతాలు ప్రపంచంలోని అత్యంత వాయు కాలుష్య టాప్-10 నగరాల్లో నిలిచాయి. ఎప్పటిలాగే వాయు కాలుష్య నగరాల్లో న్యూఢిల్లీ టాప్ లో నిలిచింది.
Delhi Air pollution: దేశరాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత హానికర స్థాయికి పడిపోయింది. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది లెక్కచేయని ప్రజలు చాలా ప్రాంతాల్లో టపాసులను పేల్చారు. నిషేధాన్ని ధిక్కరిస్తూ ఆదివారం రాత్రి పటాకులు కాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పీఎం10, పీఎం2.5 స్థాయిలు పెరిగాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీపావళి క్రాకర్స్ కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి రోజు సాయంత్రం వరకు 218గా ఉన్న ఏక్యూఐ దీపావళి తర్వాత రోజు 999కి చేరుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, ఆర్‌కే పురం, ఓఖ్లా, శ్రీనివాసపురి, వజీర్‌పూర్, బవానా, రోహిణి ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం భారీగా పెరిగింది.
దీపావళికి బాణసంచా కాల్చడంతో గాలిలో భారీగా గాలి కాలుష్యం ఏర్పడిన తర్వాత న్యూఢిల్లీతో కలిసి ముంబయి, కోల్ కతాలు ప్రపంచంలోని అత్యంత వాయు కాలుష్య టాప్-10 నగరాల్లో నిలిచాయి. ఎప్పటిలాగే వాయు కాలుష్య నగరాల్లో న్యూఢిల్లీ టాప్ లో నిలిచింది. ఒకవైపు బాణసంచా కాల్చడం వల్ల ఏక్యూఐ స్థాయి పెరిగితే మరోవైపు విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. ఇండియా గేట్ చుట్టూ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, 100 మీటర్ల దూరంలో కూడా స్పష్టంగా చూడటం కష్టంగా మారింది. దీపావళికి ముందు కూడా, ఢిల్లీ-ఎన్సీఆర్ AQI స్థాయి 999కి పెరిగింది, అయితే ఆ తర్వాత కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.
దీపావళి సాయంత్రం, గత ఎనిమిదేళ్లలో స్వచ్ఛమైన గాలి రికార్డును బద్దలు కొట్టింది. చాలా సంవత్సరాల తర్వాత, దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు స్వచ్ఛమైన ఆకాశాన్ని చూశారు. దీపావళికి ముందే, ఢిల్లీలో కాలుష్యం కారణంగా అధ్వాన్నమైన పరిస్థితిని గమనించిన సుప్రీం కోర్టు బాణాసంచా కాల్చడం, బాణసంచా అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలు పటాకులు పేల్చారు.