Asianet News TeluguAsianet News Telugu

వ్యభిచార బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం.. ఇద్దరు పోలీసులపై ఫిర్యాదు.. చివరకు ఏం జరిగిందంటే..

మసాజ్‌ సెంటర్లు, స్పాలు, స్టార్‌ హోటళ్లు, రిసార్టుల్లో వ్యభిచారం (prostitution) నిర్వహించుకునేందుకు అనుమతివ్వడమే కాకుండా.. బ్రోకర్ల (prostitution brokers) నుంచి లక్షల్లో లంచం పుచ్చుకున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పై ఏసీబీ కేసు నమోదు చేసింది. 

tamil nadu ACB Raids On Two Inspectors Houses For Taking bribe from prostitution brokers
Author
Chennai, First Published Nov 17, 2021, 10:17 AM IST

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన కొందరు పోలీసులు పాడు పనులకు పాల్పడుతున్నారు. ప్రజలు చెడు మార్గాల వైపు మళ్లకుండా చూడాల్సిన వారే.. నిందుతుల నుంచి లంచాలు తీసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న తమకేమి తెలియదు అన్నట్టుగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఇలాంటి ఓ ఘటన తమిళనాడు (tamil nadu) చెన్నైలో (Chennai) చోటుచేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం శాంవిన్సంట్ అనే పోలీస్ అధికారి చెన్నైలోని కీల్పాకం నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌గా, శరవరణ్‌ అనే అధికారి సైదాపే ట శాంతి భద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.

అయితే మసాజ్‌ సెంటర్లు, స్పాలు, స్టార్‌ హోటళ్లు, రిసార్టుల్లో వ్యభిచారం (prostitution) నిర్వహించుకునేందుకు అనుమతివ్వడమే కాకుండా.. బ్రోకర్ల (prostitution brokers) నుంచి లక్షల్లో లంచం పుచ్చుకున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో శాంవిన్సంట్, శరవరణ్ వ్యభిచార నిర్మూలన విభాగం ఇన్‌స్పెక్టర్లుగా పనిచేశారు. ఈ సమయంలో ఆ ఇద్దరూ విదేశీ, స్వదేశీ మోడల్స్‌ను చెన్నైకు రప్పించే బ్రోక ర్ల నుంచి లక్షల్లో లంచం పుచ్చుకుని చూసి చూడనట్టు వ్యవహరించినట్టు ఏసీబీకి ఫిర్యాదులందాయి.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇద్దరు అధికారులపై రహస్య విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు వెల్లడి కావడంతో.. వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సమయం కోసం వేచిచూసిన అధికారులు.. మంగళవారం ఉదయం శరవరణ్, శాంవిన్సంట్ ఇళ్లలో సోదాలు చేపట్టింది. కీల్పాకం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న శాం విన్సంట్, పులియాంతోపు పోలీసు క్వార్టర్స్‌లోని శరవణన్‌ ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు మీడియాకు వెల్లడించారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుందిని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios