ఉగ్రవాదుల మృత దేహాలను చూపండి: అమర జవాన్ కుటుంబం డిమాండ్

By narsimha lodeFirst Published Mar 6, 2019, 6:28 PM IST
Highlights

బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై  భారత వైమానిక దళం జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతోందని  పూల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ కుటుంబం డిమాండ్ చేసింది.

న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై  భారత వైమానిక దళం జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతోందని  పూల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ కుటుంబం డిమాండ్ చేసింది.

పూల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకో‌ట్‌లో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. శవాలను లెక్కించడం మా పని కాదంటూ  భారత వైమానిక దళం తేల్చి చెప్పింది.

ఈ దాడిలో సుమారరు 250 మంది ఉగ్రవాదులు మృతి చెందారని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. పూల్వామా ఉగ్ర దాడిలో యూపీ రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌కుమార్, రామ్ వకీలు మృతి చెందారు. రామ్ వకీల్ సోదరి రామ్ రక్షా మీడియాతో మాట్లాడారు.

పూల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్న విషయాన్ని చూసినట్టు చెప్పారు.ఇందుకు బాధ్యత వహించిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకొందనే భావిస్తున్నామని ఆమె చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమ దేశంలో ఎలాంటి నష్టం కలగలేదనే పాక్ ప్రకటించిన విషయాన్ని ఆమె గర్తు చేశారు. అయితే ఉగ్రవాదుల శిబిరాలపై ఇండియా జరిపిన దాడిలో మరణించిన ఉగ్రవాదుల మృత దేహాలను చూపితే తమ కుటుంబాల ఆత్మకు శాంతి కలుగుతోందన్నారు.


 

click me!