ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Siva Kodati |  
Published : Mar 13, 2021, 03:12 PM IST
ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సారాంశం

ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను కిందకి దింపేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని కన్‌స్రో వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం