తమ వర్గం అమ్మాయితో చనువుగా వుంటున్నాడని.. మాట్లాడుకుందామని పిలిచి, క్లాస్‌మేట్సే పైశాచికం

Siva Kodati |  
Published : Aug 31, 2022, 10:01 PM ISTUpdated : Aug 31, 2022, 10:02 PM IST
తమ వర్గం అమ్మాయితో చనువుగా వుంటున్నాడని.. మాట్లాడుకుందామని పిలిచి, క్లాస్‌మేట్సే పైశాచికం

సారాంశం

తమ వర్గం అమ్మాయితో చనువుగా వుంటున్నాడని.. మరో వర్గం యువకుడిని తోటి విద్యార్ధులే చితకబాదారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 

ఓ వైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుంటే మనదేశంలో నేటికీ పేద- ధనిక, అగ్రవర్ణాలు - తక్కువ కులం, మతం, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూ మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో తమ వర్గానికి చెందిన విద్యార్ధినితో మాట్లాడుతున్నాడంటూ ఓ విద్యార్ధిని తోటి విద్యార్ధులే చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. సుల్యా తాలుకాలోని ఓ కాలేజీలో బాధితుడు డిగ్రీ చదువుతున్నాడు. 

ALso Read:సూర్యాపేటలో పరువు హత్య?.. వేరే కులం వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నాడని అన్న దారుణం...

అయితే అదే విద్యాసంస్థలో చదువుకుంటున్న మరో వర్గానికి చెందిన విద్యార్ధినితో ఆ యువకుడు సన్నిహితంగా వుంటున్నాడు. దీనిని గమనించిన ఆ అమ్మాయి వర్గానికి చెందినప విద్యార్ధులు రగిలిపోయారు. మాట్లాడాలంటూ పిలిపించి కర్రలతో చితకబాదారు. తమ వర్గానికి చెందిన విద్యార్ధినితో మాట్లాడితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి.. ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System