
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సన్యం జైస్వాల్‌కు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. మొన్న ఆదివారం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఏకంగా దుబాయ్ వెళ్లాడు. అయితే, అక్కడ జైస్వాల్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జెర్సీని ధరించాడు. అంతేకాదు, పాకిస్తాన్, ఇండియా జెండాలను రెండు చేతుల్లో పట్టుకుని ఫొటో దిగాడు. ఆ పిక్ సోషల్ మీడియాకు పాకింది. దీంతో ఆయన దుబాయ్‌లో ఉండగానే యూపీలో ఆయన కుటుంబానికి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీని తర్వాత భయాందోళనలకు గురైన సన్యం జైస్వాల్ తాను పాకిస్తాన్ జెర్సీ ఎందుకు ధరించాడో వివరించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన 42 ఏళ్ల సన్యం జైస్వాల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లాడు. అయితే, ఆయన స్టేడియానికి కొంత ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో అక్కడ ఇండియా జెర్సీలు అయిపోయాయి. దీంతో పాకిస్తాన్ జెర్సీ వేసుకున్నాడు. తద్వార పాకిస్తాన్ అభిమానులు వారి టీమ్‌ను ఎంకరేజ్ చేస్తే.. తాను పాకిస్తాన్ జెర్సీ వేసుకుని ఇండియా టీమ్‌ను ఎంకరేజ్ చేస్తాననే ప్లాన్‌తో ఆ పాక్ జెర్సీ వేసుకున్నానని చెప్పాడు.
ఆ జెర్సీతో ఫొటో తీసుకున్నానని, ఆ ఫొటోను తన ఫ్రెండ్స్ కొందరికి పంపించాడు. కానీ, అటు నుంచి తన అనుమతి లేకుండానే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పో స్టు చేశారని ఆవేదన చెందాడు. తాను నిజంగానే పాక్ జెర్సీ వేసుకుని హిందుస్తాన్ అంటూ ఎంరేజ్ చేశానని వివరించాడు. దీంతో ఓ పాకిస్తాన్ అభిమాని తనతో గొడవ పెట్టుకున్నాడని, ఇండియా టీమ్‌ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావని ప్రశ్నించారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా అతను చూపించాడు.
ఈ ఘటనపై బరేలీ ఎస్ఎస్‌పీ సత్యార్థ అనిరుద్ధ పంకజ్ స్పందించారు. ఆ ఘటన దుబాయ్‌లో జరిగిందని, అంటే మన దేశం వెలుపల.. మన జ్యూరిస్‌డిక్షన్ వెలుపల అని వివరించారు. కాబట్టి, ట్విట్టర్‌లో వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని తెలిపారు.