కర్ఫ్యూలో హిందూ మహిళకు ముస్లిం ఆటో డ్రైవర్ సాయం

By narsimha lodeFirst Published May 16, 2019, 4:35 PM IST
Highlights

కర్ఫ్యూను... మతాన్ని కూడ లెక్క చేయకుండా ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.  కర్ఫ్యూను లెక్క చేయకుండా గర్భిణిని ఆసుపత్రికి చేర్చాడు ఆటో డ్రైవర్.

డిస్పూర్:కర్ఫ్యూను... మతాన్ని కూడ లెక్క చేయకుండా ఓ ఆటో డ్రైవర్ చేసిన సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.  కర్ఫ్యూను లెక్క చేయకుండా గర్భిణిని ఆసుపత్రికి చేర్చాడు ఆటో డ్రైవర్.

మత ఘర్షణల కారణంగా అసోంలోని హైలాకుండీలో కర్ఫ్యూ విధించారు.  ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ హిందూ మహిళ పురిటి నొప్పులతో ఇబ్బందిపడింది.ఈ విషయం తెలుసుకొన్న ఓ ముస్లిం యువకుడు మక్బూల్ కర్ఫ్యూను కూడ లెక్క చేయకుండా  ఆయన ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 

వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. దీంతో పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.ఈ విషయం తెలిసిన డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి నందిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించారు. 

హిందూ ముస్లిం సామరస్యాన్ని చాటిచెప్పే ఘటనలు మరిన్ని వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.కర్ఫ్యూ ఉన్న సమయంలోనూ సాహసోపేతంగా ఆమెను ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రశంసించారు. కాగా, ఘర్షణల కారణంగా ఇటీవల ఆ ప్రాంతంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

click me!