కొడుకు కోసం సోనియా: కాంగ్రెస్‌కు ప్రధాని పదవి అక్కర్లేదంటూ ఆజాద్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 16, 2019, 2:47 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో హంగ్ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో హంగ్ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కుమారుడు రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సోనియా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. బుధవారం పాట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ‘‘ తమ పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టం చేశాం... కాంగ్రెస్‌కు మద్ధతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పడితే.. ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడం.. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయంమని ఆజాద్ స్పష్టం చేశారు. ఇందుకోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు.

మిగిలిన పార్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పక ఆమోదిస్తుందని ఆజాద్ తెలిపారు. ఈ అంశంలో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా చూస్తామని వెల్లడించారు. 

click me!