రాహుల్ గాంధీ తర్వాత.. తేజస్వీ యాదవ్‌పై గుజరాత్ కోర్టులో పరువునష్టం దావా.. ఆ వ్యాఖ్యలేవంటే?

Published : Apr 27, 2023, 01:11 AM IST
రాహుల్ గాంధీ తర్వాత.. తేజస్వీ యాదవ్‌పై గుజరాత్ కోర్టులో పరువునష్టం దావా.. ఆ వ్యాఖ్యలేవంటే?

సారాంశం

బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పై గుజరాత్ కోర్టులో పరువనష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణ మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే తేజస్వీ యాదవ్‌కు కోర్టు సమన్లు పంపే అవకాశాలు ఉన్నాయి.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై గుజరాత్‌లోని కోర్టులో పరువు నష్టం దావా నమోదైంది. అహ్మదాబాద్ కోర్టులో ఈ దావా వేశారు. కేవలం గుజరాతీ మోసగాళ్లకు మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ దావా పడింది. 

పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఉపసంహరణపై స్పందిస్తూ తేజస్వీ యాదవ్ సీరియస్‌గా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితులు దాపురించాయంటే.. కేవలం గుజరాతీ మోసగాళ్ల మోసాలు మాత్రమే క్షమాపణలకు నోచుకుంటాయని, గుజరాతీ మోసగాళ్లకు మాత్రమే లభించే వెసులుబాటు ఇది అని వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై బిజినెస్ మ్యాన్ హరేష్ మెహతా అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టులో తేజస్వీ యాదవ్ పై పరువునష్టం దావా వేశారు. వార్తల్లో వచ్చిన ఆయన వ్యాఖ్యలు గుజరాతీల గౌరవాన్ని దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదైంది.

Also Read: భర్తను విడిచి పెట్టి రావాలని యువతికి వేధింపులు.. మొబైల్‌లో వీడియో ఆన్ చేసి బలవన్మరణం..

ఈ కేసులో మే 1వ తేదీ నుంచి విచారణ షెడ్యూల్ అయింది. కోర్టు త్వరలోనే తేజస్వీ యాదవ్‌కు నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయి. కోర్టులో విచారణకు హాజరవ్వాలని తేజస్వీ యాదవ్‌కు సమన్లు పంపే అవకాశాలు ఉన్నాయి. 

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష వేసింది. చట్ట సభల నుంచి సభ్యుడిని తొలగించడానికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష అవసరం. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫలితంగా ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దైంది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu