భర్తను విడిచి పెట్టి రావాలని యువతికి వేధింపులు.. మొబైల్‌లో వీడియో ఆన్ చేసి బలవన్మరణం..

Published : Apr 26, 2023, 05:22 PM IST
భర్తను విడిచి పెట్టి రావాలని యువతికి వేధింపులు.. మొబైల్‌లో వీడియో ఆన్ చేసి బలవన్మరణం..

సారాంశం

కర్ణాటకలోని  విజయపూర్ జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే ఓ యువతి బలవన్మరణం చెందింది. పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

కర్ణాటకలోని  విజయపూర్ జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే ఓ యువతి బలవన్మరణం చెందింది. పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి వేధింపులతో ఆమె మొబైల్‌లో వీడియో ఆన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. విజయపురలోని బబలేశ్వర్ తాలూకా ఉప్పలదిన్ని గ్రామంలో చోటుచేసుకుంది. 10 రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఉప్పలదిన్నే గ్రామానికి చెందిన అల్తాఫ్ సులైమాన్ ఏడాది క్రితం సుహానాను ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న సుహానా తల్లిదండ్రులు.. పెద్దల సమక్షంలో అల్తాఫ్‌ను హెచ్చరించారు. 

అనంతరం సుహానా తల్లిదండ్రులు ఆమెకు హొక్కుండి గ్రామానికి చెందిన షరీఫ్ సోనార్‌తో ఇటీవల వివాహం జరిపించారు. అయితే సుహానాపై అల్తాఫ్ వేధింపులకు పాల్పడ్డాడు. భర్తను విడిచిపెట్టి తనతో రావాలని సుహానాను అల్తాఫ్ వేధించాడు. లేదంటే తనతో దిగిన ఫోటోలను ఆమె భర్తకు చూపిస్తానని సుహానాను బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయపడిన సుహానా ఆత్మహత్య చేసుకుంది.

అయితే ముందుగా సుహాన్ మొబైల్‌లో వీడియో ఆన్ చేసి ఆత్మహత్యకు గల కారణాన్ని తెలియజేసింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోలో సుహానా.. అల్తాఫ్ తనను వేధించినట్టుగా పేర్కొంది. మరో ఇద్దరు నుంచి పేర్లను కూడా వీడియోలో ప్రస్తావించింది.  ఇందుకు సంబంధించి సుహానా తండ్రి అస్లాం ముల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బబలేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?