ప్రియురాలి కోసం భార్య హత్య.. జవాను అరెస్ట్

Published : Apr 10, 2019, 02:03 PM IST
ప్రియురాలి కోసం భార్య హత్య.. జవాను అరెస్ట్

సారాంశం

ప్రియురాలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంది ఓ జవాను సొంత భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం గురుపరపల్లిలో చోటుచేసుకుంది.


ప్రియురాలితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంది ఓ జవాను సొంత భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం గురుపరపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కృష్ణగిరి జిల్లా గురుపరపల్లి సమీపంలోని బి.దిప్పనపల్లికి చెందిన రాజేష్‌ (31). ఇతని భార్య గౌతమి (29). వీరికి గత 2012లో వివాహం జరిగింది. దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజేష్‌ రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌లో సైనికుడిగా పని చేస్తున్నాడు. ఈ స్థితిలో గౌతమి గత 5వ తేదీన ఉదయం ఇంట్లో హత్యకు గురైంది.

ఆమె ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి అందకుండా చేసి హత్య చేసినట్టు తెలిసింది. దీనిపై గురుపరపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ప్రభావతి కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో.. గౌతమి భర్త రాజేష్‌కు, కర్ణాటక రాష్ట్రం దుమ్కుర్‌ సవారివం నగర్‌కి చెందిన కలైవాణి (30) అనే మహిళకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. 

దీని గురించి తెలుసుకున్న గౌతమి భర్తను నిలదీసింది. ఈ స్థితిలో రాజేష్‌ సెలవులకి ఇంటికి వచ్చాడు. దీంతో గౌతమిని, రాజేష్‌ హత్య చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు అతని కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాజేష్‌ సోమవారం కృష్ణగిరిలో పోలీసులకు పట్టుబడ్డాడు. తన ప్రియురాలి ఒత్తిడి వల్లనే గౌతమిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజేష్, అతని ప్రియురాలు కలైవాణిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit