భార్య వేధింపులు.. 4 బైకులు, కారుకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి....!

Published : Oct 01, 2021, 07:57 AM IST
భార్య వేధింపులు.. 4 బైకులు, కారుకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి....!

సారాంశం

ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సతీష్ 2019లో భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటినుంచి తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. 

చెన్నై : నెర్కుండ్రలో భార్యపై కోపంతో నాలుగు బైకులకు, ఓ కారుకు నిప్పు(fire) పెట్టి దగ్ధం చేసిన ఐటీ ఉద్యోగిని (IT Employee)Iపోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీని మీద బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

భార్యభర్తల మధ్య వివాదాలు మామూలే. గొడవలు సర్దుబాట్లూ మామూలే కానీ..  భార్యమీది కోపంతో ఏకంగా ఇరుగుపొరుగు వారికీ నష్టం కలిగించాడో వ్యక్తి. దీంతో అటు వైవాహిక జీవితం సర్దుకోలేదు సరికదా.. ఇటు ఈ వ్యక్తి నిందితుడిగా మారి.. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. 

ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా.. గెలిచి అసెంబ్లీకొచ్చినా వదలను: సిద్ధూపై అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సతీష్ 2019లో భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటినుంచి తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. 

ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విరక్తి చెంది.. భార్య వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం అయ్యాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది. 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!