కరోనా దెబ్బ: మద్యం లేక మిథనాల్ తాగి ముగ్గురి మృతి

By narsimha lodeFirst Published Apr 16, 2020, 4:19 PM IST
Highlights
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  మద్యం దొరకని కారణంగా ఐదుగురు వ్యక్తులు మిథనాల్ తాగారు. మిథనాల్ తాగిన వారిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.
చెన్నై: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  మద్యం దొరకని కారణంగా ఐదుగురు వ్యక్తులు మిథనాల్ తాగారు. మిథనాల్ తాగిన వారిలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో మద్యం దొరకక ఐదుగురు మిథనాల్ ను మంగళవారం నాడు తాగారు.దీంతో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 అలపాలక్కం గ్రామానికి చెందిన కడలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 45 ఏళ్ల మాయాకృష్ణన్ మృతి చెందారు. జవహార్ లాల్ నెహ్రు ఇనిస్టిట్యూట్ పీజీ మెడికల్ కాలేజీలో అనయంపెట్టైకి చెందిన సుందర్రాజ్ బుధవారం నాడు మరణించాడు.

also read:కరోనా ఎఫెక్ట్ :మెట్రో సిటీలన్నీ రెడ్ జోన్ పరిధిలోనే
అలపాక్కం గ్రామానికి చెందిన చంద్రకాస్ మంగళవారంనాడు మృతి చెందాడు.  కుమారసేన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కెమికల్ ఫ్యాక్టరీ నుండి మిథనాల్ ను తీసుకొచ్చాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

మద్యం దొరకని కారణంగా మిథనాల్ తాగిన వారిలో ముగ్గురు మృతి చెందితే మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.  రెవిన్యూ అధికారులు ఈ ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
 
click me!