మే 3 వరకు లాక్‌డౌన్... ఇదొక్కటే సరిపోతుందా: కేంద్రంపై రాహుల్ ప్రశ్నలు

By Siva KodatiFirst Published Apr 16, 2020, 2:40 PM IST
Highlights
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు.

రోనాపై కలిసికట్టుపై పోరాటం చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని.. ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనాతో పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు జరగట్లేదని.. ర్యాండమ్ పద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్  చేశారు.

కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్ధంగా కట్టడి చేస్తున్నారని.. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్ధంగా జరుగుతోందని ఆయన సూచించారు. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా అమలు చేయాలని... రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలని రాహుల్ కోరారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలని.. తొలుత పేదలు, కూలీల ప్రాణాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని రాహుల్ గాంధీ సూచించారు. 
click me!