కరోనా ఎఫెక్ట్ :మెట్రో సిటీలన్నీ రెడ్ జోన్ పరిధిలోనే

By narsimha lode  |  First Published Apr 16, 2020, 3:16 PM IST
దేశంలోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా కేంద్రం బుదవారం నాడు ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ జాబితాలో చేరాయి.
 


న్యూఢిల్లీ: దేశంలోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా కేంద్రం బుదవారం నాడు ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ జాబితాలో చేరాయి.

దేశంలోని హైద్రాబాద్, బెంగుళూరు, కోల్‌కత్తా, చెన్నై,జైపూర్, ఆగ్రా నగరాలు కూడ రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. సుమారు 80 శాతానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.రెడ్ జోన్లలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.

ముంబైలో బుధవారం నాటికి 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో 2916 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం ముంబైలో నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు.
also read:తమిళనాడులో విషాదం:కరోనాలో నెగిటివ్, డెంగ్యూతో డాక్టర్ మృతి

ఇక ఢిల్లీలో 1561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో 30 మంది మృతి చెందారు.ఢిల్లీ ప్రభుత్వం 56 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసింది.

దేశ వ్యాప్తంగా 207 జిల్లాలు కూడ రెడ్ జోన్లుగా మారే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది.  కరోనా వ్యాప్తి కాకుండా ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.ఈ నెల 20వ తేదీ తర్వాత రెడ్ జోన్లు మినహా ఇతర జోన్లలో ఆంక్షలను సడలించే అవకాశాలు లేకపోలేదు. 
click me!