DDMA Guidelines: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్‌లు తెరుచుకోనున్నాయి. అయితే స్కూళ్లను దశలవారీగా తెరుస్తారు. తొలుత 9-12 తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నది.
DDMA Guidelines: దేశ రాజధాని ఢిల్లీ సోమవారం నుంచి విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్‌లు తెరుచుకోనున్నాయి. గత కొంత కాలంగా ఢిల్లీలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూళ్లను దశలవారీగా తెరుస్తారు. తొలుత 9-12 తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. అయితే టీకా తీసుకోని ఉపాధ్యాయులను విధులకు అనుమతించబోమని తెలిపింది. అన్ని కార్యాలయాలు వంద శాతం సిబ్బంది హాజరుతో పని చేయవచ్చని పేర్కొంది.
ఫిబ్రవరి 7వ తేదీ నుండి.. 9-12వ తరగతులకు… నర్సరీ నుండి 8వ తరగతి వరకు, ఫిబ్రవరి 14 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అలాగే అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు 100% సామర్థ్యంతో పనిచేయడానికి పర్మిషన్లు ఇచ్చింది. జిమ్‌లు స్విమ్మింగ్ పూల్స్ కూడా పూర్తిగా తెరవనున్నారు. మరోవైపు రాత్రి కర్ఫ్యూను ఒక గంట తగ్గించి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి. అన్నివిద్యా సంస్థల ప్రవేశ, నిష్క్రమణ గేట్లను థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయడం. ప్రాంగణాలను శానిటైజేషన్ చేయడం వంటి కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) తెలిపింది. అలాగే.. విద్యాసంస్థల సిబ్బంది అందరికీ టీకాలు వేయించాలని DDMA మార్గనిర్ధేశం చేసింది.
లైబ్రరీలు, కళాశాల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా శానిటైజేషన్ నిర్వహించాలని, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు తగినన్ని అందుబాటులో ఉండాలని పేర్కొంది. ల్యాబ్‌లు, తరగతి గదుల కెపాసిటీ/ఆక్యుపెన్సీ స్థాయికి అనుగుణంగా టైమ్ టేబుల్‌ను సిద్ధం చేయాలని DDMA తెలిపింది. తరగతులల్లో రద్దీని నివారించడానికి అన్ని రూమ్స్ కు ఎగ్జిట్,ఎంట్రీ గేట్లను ఉపయోగించాలని, ఉదయం షిఫ్ట్‌లోని చివరి గ్రూప్ విద్యార్థుల నిష్క్రమణ, సాయంత్రం షిఫ్టులోని మొదటి గ్రూప్ విద్యార్థుల ప్రవేశానికి మధ్య గ్యాప్ ఉండాలని సూచించింది.
undefined
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.. లంచ్ బ్రేక్‌లు రద్దీని నివారించడానికి, బహిరంగ ప్రదేశంలో నిర్వహించాలని, అయితే క్యాంపస్ కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం విద్యార్థులకు అనుగుణంగా ఉండాలి. ఉపాధ్యాయులు.. విద్యార్థులతో మాట్లాడి మానసికంగా సన్నద్ధం చేయడంతోపాటు బోధన, అభ్యాస కార్యకలాపాలకు భావోద్వేగ మద్దతును అందించాలి. ఉన్నత విద్యాసంస్థలను కూడా పునఃప్రారంభించేందుకు DDMA అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ.. వర్సిటీ మరికొద్ది రోజుల్లో ఢిల్లీ యూనివర్సిటీ తెరవబడుతుందనీ, దీనికి సంబంధించి వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. యుజిసి మార్గదర్శకాల కోసం వేచి చూస్తామని, ఆపై తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో క్యాంపస్‌ను తిరిగి తెరవడం గురించి చర్చిస్తామన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (GGSIPU) కూడా ఢిల్లీ ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయని అధికారులు తెలిపారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారి మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తామనీ, తాము సన్నాహాలను ప్రారంభించామనీ, క్యాంపస్‌ను శానిటైజ్ చేయడం ప్రారంభించామని, విద్యార్థులకు మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు.
GGSIPU వైస్-ఛాన్సలర్ డాక్టర్ మహేష్ వర్మ మాట్లాడుతూ.. తాము DDMA మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని, క్యాంపస్‌ను తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి రావడానికి కొన్ని రోజుల సమయం ఇస్తామని DU వైస్-ఛాన్సలర్ చెప్పారు. DDMA 100 శాతం సీటింగ్ కెపాసిటీని అనుమతిస్తే.. తాము ఖచ్చితంగా క్యాంపస్‌ని తిరిగి తెరుస్తామని, అయితే చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుండి క్యాంపస్‌కి తిరిగి వస్తారనీ, కాబట్టి విద్యార్థులకు కొన్ని రోజుల సమయం ఇస్తామని ఆయన అన్నారు. డీడీఎంఏ 100 శాతం కెపాసిటీని అనుమతిస్తే, పరిస్థితి సాధారణంగా ఉందని భావించి హాస్టల్ కేటాయింపు కూడా జరుగుతుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం విడుదల చేసిన డిడిఎంఎ మార్గదర్శకాలతో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ను తక్షణమే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న విసి కార్యాలయం వెలుపల విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నిరసనకు పిలుపునిచ్చింది.