"దయె" ఎఫెక్ట్: ఒడిషాకు పొంచివున్న వరద ముప్పు

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 2:15 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘దయె’’ ప్రభావంతో ఒడిషా చిగురుటాకులా వణికిపోతోంది. దయె తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘దయె’’ ప్రభావంతో ఒడిషా చిగురుటాకులా వణికిపోతోంది. దయె తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడి.. విద్యుత్ తీగలు తెగిపోవడంతో.. కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

మల్కాన్‌గిరి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. చిత్రకొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అప్రమత్తమయ్యారు.

సచివాలయం నుంచి ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

click me!