భర్త రెండో పెళ్లి.. సవతిని గ్యాంగ్‌రేప్ చేయించిన మొదటి భార్య

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 01:54 PM IST
భర్త రెండో పెళ్లి.. సవతిని గ్యాంగ్‌రేప్ చేయించిన మొదటి భార్య

సారాంశం

తనకు విడాకులిచ్చి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్న భర్తపై మాజీ భార్య పగ తీర్చుకుంది. తన బంధువులతో భర్త రెండో భార్యపై అత్యాచారం చేయించింది. 

తనకు విడాకులిచ్చి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్న భర్తపై మాజీ భార్య పగ తీర్చుకుంది. తన బంధువులతో భర్త రెండో భార్యపై అత్యాచారం చేయించింది. హర్యానాలోని పానిపట్టుకు చెందిన ఓ వ్యక్తి.. గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లి అయిన క్షణం నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలతో ఓపిక నశించిన భర్త.. గతేడాది డిసెంబర్‌లో భార్యకు విడాకులిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విడాకులివ్వడం.. తన మాజీ భర్త రెండో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలని మాజీ భార్య..పగతో రగిలిపోయింది.

అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించి బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మాజీ భర్త ఇంటికి తన బంధువులతో చేరుకుంది. మాజీ భర్త, అతని భార్య, అత్తను చితకబాదారు. అత్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. మాజీ భర్తను, అతని భార్యను వేర్వేరు వాహనాల్లోకి ఎక్కించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు..

అనంతరం తన మాజీ భర్తకు విడాకులివ్వాలని కొత్త భార్యను మాజీ భార్య వేధింపులకు గురి చేసింది..దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ భార్య.. నవ వధువుపై కదులుతున్న వాహనంలోనే అత్యాచారం చేయించింది.

అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బహదుర్గాహర్ బస్టాండ్‌లో మాజీ భర్తతో పాటు ప్రస్తుత భార్యను వదిలిపెట్టారు. తీవ్ర గాయాలపాలైన వీరు పానిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu