Dawood Ibrahim: మళ్లీ భారత్ ను టార్గెట్ చేసిన దావూద్ ఇబ్రహీం.. హిట్ లిస్టులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు !

Published : Feb 19, 2022, 01:17 PM IST
Dawood Ibrahim: మళ్లీ భారత్ ను టార్గెట్ చేసిన దావూద్ ఇబ్రహీం.. హిట్ లిస్టులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు !

సారాంశం

Dawood Ibrahim: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మ‌రోసారి భార‌త్ ను ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌నీ, దీని కోసం ప్ర‌త్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశాడ‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. దీని హిట్ లిస్టులో దేశంలో రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార‌వేత్త‌లు ఉన్నార‌ని తెలిపింది.   

Dawood Ibrahim: గ్యాంగ్‌స్టర్‌, అండ‌ర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మ‌రోసారి భార‌త్ ను టార్గెట్ చేసిన‌ట్టు నిఘా వ‌ర్గాల స‌మాచారం. దావూద్ ఇబ్రహీం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడ‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. ఈ హిట్ లిస్టులో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నార‌ని తెలిపింది. వివ‌రాల్లోకెళ్తే.. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఇది దేశంలోని ప్రముఖ వ్యక్తులకు ముప్పుగా పరిణమించిందని NIA (National Investigation Agency) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం భారత్ లోని ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి, దేశ రాజ‌ధాని ఢిల్లీ, వంటి న‌గ‌రాల‌పై దృష్టి సారించిన‌ట్టు పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో దాడులు జ‌రిగే అవ‌కాశమంద‌ని సంబంధిత వ‌ర్గాలు అంచనాకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. 

దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) తన ప్రత్యేక విభాగంతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో దేశంపై దాడికి ప్లాన్ చేస్తున్నాడని ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబ‌యిల‌పై దావూద్ ఇబ్రహీం దృష్టి సారించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పై ఇటీవల ఎన్‌ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇందులో సంచలన విషయాలను పేర్కొన్నట్లు స‌మాచారం. భార‌త్ టార్గెట్ చేసిన దావుద్ ఇబ్ర‌హీం, త‌న ప్ర‌త్యేక విభాగంతో క‌లిసి దేశంలో దాడులు నిర్వ‌హించ‌డానికి  ప్రణాళికలు రచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ (National Investigation Agency) పేర్కొంది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది. 

గ్యాంగ్‌స్టర్‌, అండ‌ర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim)పై దాఖ‌లైన ఈ ఎప్ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  దావూద్ ఇబ్ర‌హీంపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ క్ర‌మంలోనే దావుద్ ఇబ్ర‌హీంకు ద‌గ్గ‌రి వారిగా గుర్తించిన ప‌లువురి ఇండ్ల‌తో పాటు.. ముంబయిలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందిఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని సహాయకులు, ముఠా సభ్యులను ఈడీ ప్రశ్నించనుంది. దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ ఇంటికి కూడా అధికారులు వెళ్లినట్లు తెలిసింది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లోనూ ఈ సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం గ్యాంగ్ స్ట‌ర్ దావుద్ ఇబ్ర‌హీం (Dawood Ibrahim) కు ద‌గ్గ‌రి సంబంధం క‌లిగి ఉన్న ప‌లువురిని ఈడీ ఇప్ప‌టికే క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తున్న‌ది. మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఇక్బాల్ కస్కర్‌ను ఫిబ్రవరి 24 వరకు ED కస్టడీకి పంపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి ఇబ్రహీం (Dawood Ibrahim) తో సంబంధం ఉన్నమొత్తం 10 చోట్ల సోదాలు జ‌రిపింది. గ్యాంగ్ స్ట‌ర్ దావుద్ ఇబ్ర‌హీం మ‌రోసారి భార‌త్ టార్గెట్ చేశాడ‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో భ‌ద్ర‌తా వ‌ర్గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. అన్ని విభాగాల‌ను అధికార యంత్రాంగం అల‌ర్ట్ చేసింద‌ని స‌మాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నన్నెవరూ పట్టించుకోలేదు నా గర్వమంతా దిగిపోయింది | Rajinikanth at Art of living | Asianet News Telugu
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్న సీఎం విజయ్ | CM Vijay Wins Floor Test in Tamil Nadu Assembly