భార్య గాఢ నిద్రలో ఉండగా.. కూతురిని పొలాల్లోకి తీసుకెళ్లి తండ్రి అత్యాచారం

Published : Sep 18, 2018, 01:04 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
భార్య గాఢ నిద్రలో ఉండగా.. కూతురిని పొలాల్లోకి తీసుకెళ్లి తండ్రి అత్యాచారం

సారాంశం

కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. కూతురికి రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నబిడ్డపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. నోయిడాలోని గౌతమ్ బుద్ధా నగర్‌లో ఇద్దరు భార్యా భర్తలు నివసిస్తున్నారు.

కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. కూతురికి రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నబిడ్డపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. నోయిడాలోని గౌతమ్ బుద్ధా నగర్‌లో ఇద్దరు భార్యా భర్తలు నివసిస్తున్నారు. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని తరచుగా గొడవపడుతుండేవారు.

ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతలో ఇంట్లో భార్య గాఢనిద్రలో ఉండటాన్ని గమనించి.. నిద్రపోతున్న కూతురిని లేపి ఇంటికి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మరుసటి రోజు ఉదయం భర్త చేసిన ఘోరం తెలియడంతో తల్లి సదరు కామాంధుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?