కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

sivanagaprasad kodati |  
Published : Oct 04, 2018, 12:41 PM IST
కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. పదేళ్లుగా అత్యాచారం చేస్తూ.. ఆమెను రెండుసార్లు తల్లిని చేశాడు. ఢిల్లీలోని మంగోల్‌పురికి చెందిన యువతి తన తండ్రి తనపై 2008 నుంచి అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. 

మొబైల్‌లో బ్లూఫిల్మ్‌లు చూపించి అత్యాచారం చేసేవాడని.. ఆయన వల్ల 2011, 2013లో తాను గర్భం దాల్చినట్లు ఆమె తెలిపింది. ఒకసారి మందు తాగించి.. మరోసారి కడుపుపై తన్ని గర్భస్రావం అయ్యేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

చిన్నప్పుడు తనకు తండ్రి చేసే చేష్టలు అర్థం అయ్యేవి కావని.. అయితే ఊహా తెలిసిన తర్వాత తండ్రి పైశాచికం తెలిసిందని.. నాటి నుంచి ఈ చర్యను వ్యతిరేకించడం మొదలుపెట్టానని తెలిపింది. కానీ తన తండ్రి దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదని.. తల్లి అడ్డు చెప్పడంతో ఇంట్లో గొడవలు జరిగాయని చెప్పింది.

తన మాట వినకుంటే కూతురు జననాంగాలలో కత్తి లేదా పగిలిన మద్యం సీసా పెడతానని బెదిరించేవాడని.. అతని బెదిరింపులతో తల్లి కూడా మౌనంగా ఉండిపోయేదని వాపోయింది.

తన వల్ల ఇంట్లో గొడవలు జరగకూడదనే ఉద్దేశ్యంతో తండ్రి పైశాచికాన్ని భరించానని..అయితే తన స్నేహితులతో గడపాల్సిందిగా తండ్రి ఒత్తిడి తెచ్చేవాడని.. అతని వేధింపులు భరించలేక ఒకసారి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించానని.. తన తల్లి ప్రాణాలు కాపాడిందని వివరించింది.

అయితే చివరకు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు తన గోడు వెళ్లబోసుకున్నానని..తన ఫ్రెండ్ సాయంతో ఇంట్లోంచి తప్పించుకుని నాగ్‌పూర్‌కు చేరుకుని.. చైల్డ్ లైన్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. సదరు కామాంధుడిపై సెప్టెంబర్ 30న పాలం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Visits Somnath Temple: సోమనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మోదీ | Asianet Telugu
Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధ‌నిక గ్రామం మాధాప‌ర్ విశేషాలు