కెమికల్ మీద పడి బైకర్ మృతి

Published : Oct 04, 2018, 11:37 AM IST
కెమికల్ మీద పడి బైకర్ మృతి

సారాంశం

సడెన్ గా వారిపై ఓ కెమికల్ వచ్చి పడింది.  దీంతో ఒక్కసారిగా వారి శరీరంపై మంటలు, బొబ్బలు రావడం మొదలయ్యాయి.

కెమికల్ మీదపడి ఓ బైకర్ మృతి చెందిన సంఘటన దేశరాజధాని ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది.  తూర్పు ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నగరానికి చెందిన అమిత్ చౌహాన్(32), రాహుల్ లు బుధవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. సడెన్ గా వారిపై ఓ కెమికల్ వచ్చి పడింది.  దీంతో ఒక్కసారిగా వారి శరీరంపై మంటలు, బొబ్బలు రావడం మొదలయ్యాయి. ఇద్దరూ అక్కడే పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని జీటీబీ హాస్పిటల్ కి తరలించారు.

కాగా.. చికిత్స పొందుతూ అమిత్ మరణించగా.. రాహుల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కెమికల్ ఎక్కువ మొత్తం అమిత్ పై పడటంతో అతను తీవ్రగాయాలపాలయ్యాడు.  స్వల్పగాయాలతో బయటపడిన రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో