పంజా విసురుతున్న కరోనా: కేరళలో వీక్లీ లాక్‌డౌన్

By narsimha lodeFirst Published Jul 29, 2021, 11:06 AM IST
Highlights

కేరళలో వీక్లీ లాక్‌డౌన్ ను విధించింది పినరయి విజయన్ సర్కార్.  కేరళలో బుధవారం నాడు 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

తిరువనంతపురం:కేరళలో కరోనా కేసులు పెరిగిపోవడంతో వీక్లి లాక్‌డౌన్ ను విధిస్తూ విజయన్ సర్కార్ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ వారం నుండే వీక్లీ లాక్‌డౌన్ ను అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో కేరళ నుండే 40 శాతం కేసులు కావడం గమనార్హం. దీంతో కేరళ ప్రభుత్వం కూడ అప్రమత్తమైంది. 

కేరళలో కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని ఇవాళ పంపింది.ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.కేరళలో  పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదౌతున్నందున సెంట్రల్ టీమ్‌ను పంపుతున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వ్యాక్సిన్ ప్రక్రియలో  రాష్ట్రం చాలా ముందున్నప్పటికి కరోనా కేసుల వ్యాప్తి తగ్గడం లేదు.  దీనిపై వాస్తవాలను తెలుసుకొనేందుకుగాను కేంద్ర బృందం పర్యటించనుంది.ఐసీఎంఆర్  ఈ ఏడాది జూన్ 14 నుండి జూలై 6 మధ్య నిర్వహించిన సర్వేలో కేరళ వాసులకు 44.4 శాతం మాత్రమే యాంటీబాడీస్ ఉన్నట్టుగా గుర్తించారు. బుధవారం నాడు కేరళలో  22.056 కేసులునమోదయ్యాయి. 

click me!