డ్యాన్సింగ్ బామ్మ : డెభ్బైయేళ్ల వయసులో డ్యాన్స్ ను ఇరగదీస్తుంది, వీడియోలు వైరల్...

Published : Jul 29, 2021, 10:57 AM IST
డ్యాన్సింగ్ బామ్మ : డెభ్బైయేళ్ల వయసులో డ్యాన్స్ ను ఇరగదీస్తుంది, వీడియోలు వైరల్...

సారాంశం

  కృష్ణకుమారి డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్ఫుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఖాట్మండు : లేడి పిల్లలా చెంగుచెంగున నడుస్తూ.. నెమలిలా నాట్యం చేస్తోంది కృష్ణ కుమారి తివారి. నాట్యం చేస్తుంటే అందరి కళ్లు ఆమెపైనే. కాల్లకు ఘల్లుఘల్లుమనే గజ్జలు కట్టుకుని, నాట్యంతో హావభావాలు పలికిస్తోన్న అమ్మాయి కదా.. అందరూ అసక్తిగా చూస్తారులే.. అనుకుంటే మీరు పొరబడినట్లే.. డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో మైమరిపించే స్టెప్పులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంద కృష్ణకుమారి బామ్మ.

నేపాల్ లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణకుమారి తివారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఇంట్లో వాళ్లు డ్యాన్స్ ను ప్రోత్సమించేవారు కాదు. సంప్రదాయ కుటుంబాలలోని ఆడపిల్లలు డాన్సులంటూ తిరిగితే సమాజం నుంచి వెలివేస్తారేమోనని భయపడే రోజుల్లో ఆమె బాల్యం గడిచింది. దీంతొ తనకు ఎంతో ఇష్టమైన నాట్యం తీరని కలగానే మిగిలిపోయింది. 

పెళ్లీ,పిల్లలు, వారి బాధ్యతలు అన్నీ తీరడం, ఇప్పుడు తీరిక దొరకడం చిన్నప్పటి కట్టుబాట్లు ప్రస్తుతం లేకపోవడంతో ఒంట్లోలోని ఓపికను కూడగట్టుకుని పదహారేళ్ల పడుచులా డాన్స్ చేస్తూ తన చిరకాల కోరికను తీర్చుకుంటోంది.  కృష్ణకుమారి డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు ఆమె కుటుంబ సభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్ఫుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆమె డ్యాన్సింగ్ వీడియోలలో ఒకదానికి దాదాపు రెండు కోట్ల వ్యూస్, 65వేల కామెంట్లు కూడా వచ్చాయి. కృష్ణకుమారి డ్యాన్స్ గురించి తెలిసిన వారంతా ఆ చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలకు ఆహ్వానిస్తూ ఆమె డ్యాన్స్ ను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘అప్పటి సమాజంలో ఉన్న నిబంధనలను అనుసరించి డ్యాన్స్ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు నాకేం జరుగుతుందో తెలియడం లేదు. ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూనే ఉంటున్నాను.

ఎవరూ నన్ను ఆపడం లేదు. నా పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. నా డ్యాన్స్ వీడియోలకు చాలామంది అభిమానుం చూపిస్తుంటే మరింత డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. డ్యాన్స్ చేస్తూ చనిపోవాలని ఉంది. అని కృష్ణకుమారి సంతోషంతో నీళ్లు నిండిన కళ్లతో చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu