కూతురును కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు.. నాన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. సోషల్ మీడియాలో బిడ్డ పోస్టు

Published : Jan 30, 2022, 01:47 PM IST
కూతురును కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు.. నాన్న మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. సోషల్ మీడియాలో బిడ్డ పోస్టు

సారాంశం

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురు కిడ్నాప్ అయిందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేసింది. తమను ఇబ్బంది పెట్టవద్దని తండ్రిని పేర్కొంటూ ఓ వీడియో పోస్టు పెట్టింది. దీంతో పోలీసు స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.  

హాజీపూర్: ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. కాలేజీలోనే ప్రేమలో పడిపోవడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం. ఒక్కోసారి కనీసం తల్లిదండ్రులకు సమాచారమైనా ఇవ్వడం లేదు. ఉన్నట్టుండి వారిద్దరూ కనిపించరు. చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతారు. తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లను ఆశ్రయించడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు. బయటికి వెళ్లిపోయిన జంటలు కూడా కొందరు పోలీసు స్టేషన్‌లను ఆశ్రయించి రక్షణ కోరుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి బిహార్‌లో చోటుచేసుకుంది. అయితే, ఆ ఘటన కొత్త ట్విస్ట్‌తో ముందుకు వచ్చింది.

బిహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గొరౌల్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగా, ఆయన కుమార్తె సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టింది. నాన్న.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ ఓ వీడియో పోస్టు చేసింది. తన ఇష్టపూర్వకంగా ఆ అబ్బాయితో పెళ్లి చేసుకున్నారని అందులో తెలిపింది. అందుకే తాను సంతోషంగా ఉన్నదని వివరించింది. కాబట్టి, దయచేసి తమను డిస్టర్బ్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఆమె మాలిక్‌పురాకు చెందిన అమ్మాయిగా ఆ వీడియో తెలుపుతున్నది.

దీంతో పోలీసు స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. తన కూతురును అపహరించారని తండ్రి చేసిన ఫిర్యాదుతో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా, రెండో ఎఫ్ఐఆర్ మాత్రం ఆయన కూతురు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఆధారంగా నమోదైంది. 

ఇదిలా ఉండగా, జీవితాంతం తోడు ఉంటానని ఏడడుగులు నడిచి మూడు ముళ్లు వేసిన ఓ వ్యక్తి  ఆరు నెలలకే wifeను వదిలేసి loverతో ఉడాయించాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఆనంగళ్ల మహేష్ (30)కు ఖైతాపురం గ్రామానికి చెందిన 26ఏళ్ల యువతితో గత ఏడాది జూన్ 4న marriage జరిగింది. 

అప్పటి నుంచి మహేష్ సదరు యువతితో బాగానే కాపురం చేశాడు. నిరుడు డిసెంబర్ 31న భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన యువతితో కలిసి బైక్పై పారిపోతూ దేశ్ ముఖి వద్ద అదుపు తప్పి కింద పడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి మహేష్ ను అతని కుటుంబ సభ్యులు, ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.  

మహేష్  ఈనెల 10న చెకప్ కోసం ఆస్పత్రికి వెళుతున్నాను అని చెప్పి, ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు రాలేదు. భీమనపల్లిలో యువతి కూడా లేదు.  దీంతో అతడి భార్య ఈనెల 13న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మిస్సింగ్ కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు మహేష్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

దీంతో మహేష్ భార్య మల్కాపురంలోని అతని ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులను బయటకు పంపించి.. ఇంటికి తాళం వేసి  ఇంటి ఎదుట  బంధువులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఆందోళనకు దిగింది.  రోజంతా ఇంటి ఎదుట బైఠాయించింది. సాయంత్రం ఎస్ఐ మానస వచ్చి ఆమెతో చర్చించారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !