మామతో కోడలి ఎఫైర్.. నలుగురు ప్రాణాలు తీసింది

Published : Jan 04, 2019, 12:21 PM IST
మామతో కోడలి ఎఫైర్.. నలుగురు ప్రాణాలు తీసింది

సారాంశం

తండ్రి లాంటి మామగారితో ఓ కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధం కారణంగా.. నాలుగు ప్రాణాలు గాలిలో కలిచిపోయాయి.

తండ్రి లాంటి మామగారితో ఓ కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధం కారణంగా.. నాలుగు ప్రాణాలు గాలిలో కలిచిపోయాయి. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కనియం బాడి సీమప నెలవాయ్ గ్రామానికి చెందిన జయంతికి క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి మహాలక్ష్మి(6), శ్రీలక్ష్మి(3) సంతానం కూడా ఉన్నారు. 

కాగా.. వీరి ఇంటికి ధనశేఖర్ పెదనాన్న గోపాల కృష్ణన్ ... తరచూ వస్తూ ఉండేవాడు. ఇలా వస్తున్న క్రమంలో ఏర్పడి న పరిచయం కాస్త.. గోపాలకృష్ణన్, జయంతిల మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది..

గత నెల డిసెంబర్ 22వ తేదీన భర్తకు తెలియకుండా జయంతి.. తన ఇద్దరు పిల్లలతో సహా గోపాల కృష్ణన్ తో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడపడాన్ని జయంతి పెద్ద కుమార్తె మహాలక్ష్మి పసిగట్టింది. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో కన్న కూతురు అని కూడా చూడకుండా గొంతు పిసికి చంపేసింది.

ఇదే సమయంలో.. .జయంతి భర్త ధనశేఖర్..భార్య పిల్లలు కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జయంతి, గోపాలకృష్ణన్ లు.. తమిళనాడు నుంచి విజయవాడ పారిపోయి వచ్చారు. ఎలాగైనా పోలీసులు తమను పట్టుకుంటారనే భయంతో చిన్న కుమార్తె శ్రీలక్ష్మి.. మామ గోపాలకృష్ణన్ తో  కలిసి విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?