కాంగ్రెస్ కి షాక్.. అజయ్ మాకెన్ రాజీనామా

Published : Jan 04, 2019, 11:04 AM IST
కాంగ్రెస్ కి షాక్.. అజయ్ మాకెన్ రాజీనామా

సారాంశం

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు.

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. గురువారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన అజయ్ మాకెన్.. ఆ తర్వాత తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

‘‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాను.  ఈ నాలుగేళ్లు రాహుల్ గాంధీ, పార్టీ కార్యకర్తలు, మీడియా నుంచి వెలకట్టలేని ప్రేమ, మద్దతు పొందాను’’ అంటూ మాకెన్ ట్వీట్ చేశారు.

మాకెన్ రాజీనామాను రాహుల్ గాంధీ ఆమోదించారు. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరో సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీకి ఆ బాధ్యతలు అప్పగించారు.  వ్యక్తిగత, అనారోగ్య సమస్యల కారణంగా మాకెన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకే మాకెన్ రాజీనామా చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !
పేదరిక నిర్మూలనకు సరికొత్త ఫార్ములా.. ఇక గ్రామాల బాధ్యత విద్యార్థులదే