ఆరో పెళ్లి కోసం భర్త పరార్..కూతురితో, నిండు గర్భంతో గుడిలో భార్య

sivanagaprasad kodati |  
Published : Jan 04, 2019, 12:04 PM IST
ఆరో పెళ్లి కోసం భర్త పరార్..కూతురితో, నిండు గర్భంతో గుడిలో భార్య

సారాంశం

ప్రేమ మైకంలో పడి తల్లిదండ్రులను కూడా కాదనుకుని అతనిని పెళ్లాడిన యువతికి ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. తన భర్త అప్పటికే నలుగురిని పెళ్లాడాడని, ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో పరారయ్యాడని ఐదో భార్య పోలీసులుకే ఫిర్యాదు చేసింది. 

ప్రేమ మైకంలో పడి తల్లిదండ్రులను కూడా కాదనుకుని అతనిని పెళ్లాడిన యువతికి ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. తన భర్త అప్పటికే నలుగురిని పెళ్లాడాడని, ఆరో పెళ్లి చేసుకునేందుకు మరో యువతితో పరారయ్యాడని ఐదో భార్య పోలీసులుకే ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు దిండుక్కల్ తేనాంపట్టికి చెందిన మురుగన్ మల్లిక దుకాణం నడుపుతున్నాడు. అతనికి రాధ అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారు.

అయితే వీరి ప్రేమను రాధ తల్లిదండ్రులు తిరస్కరించారు. అయినప్పటికీ ప్రియుడి మీద నమ్మకంతో కన్నవారిని సైతం వద్దనుకుని మురుగన్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈ క్రమంలో మురుగన్‌కు వ్యాపారంలో నష్టం ఏర్పడటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో ఎక్కడికైనా వెళ్లి డబ్బు సంపాదించి తీసుకొస్తానని భార్యతో చెప్పి వెళ్లాడు.

ఎన్ని రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో అతని కోసం రాధ అనేక చోట్ల గాలించింది. విచారణలో ఆమెకు అసలు వాస్తవం తెలిసింది.. మురుగన్‌కు గతంలోనే నలుగురితో వివాహమైందని, తాను ఐదో భార్య అని తెలియడంతో దిగ్భ్రాంతికి గురైంది.

అంతేకాదు మురుగన్ ఆరో పెళ్లి చేసుకునే పనిలో మరో యువతితో పరారైనట్లు తెలిసింది. ఏం చేయలో తెలియని స్థితిలో పుట్టింటికి వెళ్లిన రాధను ఆమె తల్లిదండ్రులు ఆదరించలేదు.

దిక్కు తోచనిస్థితిలో ఆమె కొన్ని రోజులుగా బిడ్డతో కలిసి ఆలయంలోనే తలదాచుకుంటోంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. తనను మోసం చేసి పారిపోయిన భర్తపై వడమధురై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?