ప్రేమ పెళ్లికి అడ్డువస్తాడని తండ్రి కాళ్లు విరగ్గొట్టించిన కూతురు.. ఏం చేసిందంటే?

Published : Aug 11, 2023, 06:31 AM IST
ప్రేమ పెళ్లికి అడ్డువస్తాడని తండ్రి కాళ్లు విరగ్గొట్టించిన కూతురు.. ఏం చేసిందంటే?

సారాంశం

మహారాష్ట్రలో ఓ యువతి తన ప్రేమకు అడ్డుగా ఉంటాడని భావించి కన్న తండ్రి కాళ్లు విరగ్గొట్టించింది. తన లవర్‌తో కలిసి ఈ ప్లాన్ వేసింది. నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చి కాళ్లు విరగ్గొట్టించింది. కానీ, పోలీసులు విచారణలో ఈ విషయం తెలిసిపోయింది.  

ముంబయి: ఓ యువతి తన ప్రేమను కాపాడుకోవడానికి తండ్రికి హాని తలపెట్టింది. తండ్రి ప్రాణాలతో ఉండాలి గానీ, తన ప్రేమకు అడ్డుగా ఉండకూడదని అనుకుంది. అందుకే ఆమె, ఆమె లవర్ ఇద్దరూ కలిసి ఓ స్కెచ్ వేశారు. వారు కొందరికి డబ్బులు సుపారీగా ఇచ్చి తండ్రి కాళ్లు విరగ్గొట్టించారు. ఈ స్కెచ్‌లో స్వయంగా కూతురు కూడా ఓ పాత్ర పోషించడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది.

సోలాపూర్ జిల్లా మధ తాలుకాలో మహేంద్ర షా అనే పేరు మోసిన వ్యాపారి ఉన్నాడు. మహేంద్ర షా కుమార్తె సాక్షి.. చైతన్య అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకు పారిపోయి పెళ్లి చేసుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అయితే, ఆ తర్వాతైనా తన తండ్రితో తిప్పలు తప్పదని కుమార్తె భావించింది. దీంతో తండ్రి కాళ్లు విరగ్గొట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇద్దరూ కలిసి తండ్రి కాళ్లు విరగ్గొట్టాలని ప్లాన్ వేసుకున్నారు.

అందుకోసం కొందరు కిరాయి రౌడీలను మాట్లాడుకున్నారు. వారికి రూ. 60 వేల సుపారీ కూడా ఇచ్చారు. ఈ ప్లాన్‌లో కుమార్తె పాత్ర కీలకంగా ఉన్నది. కుమార్తె ఈ ప్లాన్ ప్రకారమే పూణే వెళ్లింది. తిరిగి ఆదివారం రాత్రి మధకు వచ్చింది. తన తండ్రికి ఫోన్ చేసి పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పింది.

Also Read: యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉత్తర కొరియా!.. మిలిటరీకి కిమ్ జోంగ్ పిలుపు

తండ్రి మహేంద్ర షా కారులో తన బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చాడు. దారి మధ్యలో సాక్షి కారు ఆపించింది. కారును అనుసరిస్తూ రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు మహేంద్ర షాపై దాడి చేశారు. దారుణంగా కొట్టారు. కాళ్లు విరగ్గొటి పరారయ్యారు. 

మహేంద్ర గాయాలతో గట్టిగా అరుపులు వేశాడు. స్థానికులు వచ్చి ఆయనను హాస్పిటల్ తీసుకెళ్లారు. కేసు ఫైల్ అయింది. అనూహ్యంగా పోలీసులు మహేంద్ర షా బిడ్డను అరెస్టు చేశారు. ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సాక్షిని ప్రధాన నిందితురాలిగా పోలీసులు కేసులో చేర్చారు. ఆమె లవర్ చైతన్య రోల్‌ను కూడా గుర్తించారు. వీరిద్దరు సహా దాడి చేసిన నలుగురిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌