ఆ కేసులో కోర్టుకు బర్రెను కూడా తీసుకువచ్చారు.. ఎందుకో తెలుసా?

Published : Aug 11, 2023, 02:09 AM IST
ఆ కేసులో కోర్టుకు బర్రెను కూడా తీసుకువచ్చారు.. ఎందుకో తెలుసా?

సారాంశం

రాజస్తాన్‌లోని చౌము కోర్టుకు ఓ దొంగతనం కేసులో గేదెను కూడా తీసుకువచ్చారు. గేదెల చోరీ కేసులో సాక్షుల స్టేట్‌మెంట్ కోసం కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో సాక్షులతోపాటు గుర్తింపుకోసం గేదెను కూడా తీసుకువచ్చారు.  

జైపూర్: రాజస్తాన్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గేదెల దొంగతనం కేసు కోర్టు విచారిస్తుండగా అక్కడికి బర్రెను కూడా ఓ ట్రాలీలో తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో పోస్టు చేశారు. అసలు కోర్టుకు బర్రెకు తీసుకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా మీ డౌటు.. లేటెందుకు పదండి తెలుసుకుందాం.

జైపూర్ జిల్లాలో చౌము అనే ఓ పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో సుమారు పదేళ్ల క్రితం మూడు గేదెలు చోరీ అయ్యాయి. ఈ దొంగతనానికి సంబంధించి హర్మదా పోలీసులకు ఫిర్యాదు అందింది. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మొత్తంగా రెండు గేదెలను పోలీసులు పట్టుకోగలిగారు. వాటిని యజమానికి అప్పగించారు. ఈ రెండింటిలో కొన్నేళ్ల క్రితం ఓ గేదె మరణించింది.

Also Read: రేణు దేశాయ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రామంబాబు రియాక్షన్ ఇదే

ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతూనే ఉన్నది. కేసు విచారణలో భాగంగా సాక్షులు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం కోసం కోర్టుకు హాజరు కావాలని ఇటీవలే సమన్లు అందాయి. అనంతరం, విచారణ రోజున సాక్షులతోపాటు గేదెను కూడా కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్ కోసం ఆ గేదెను కోర్టుకు తీసుకువచ్చినట్టు చెబుతున్నారు. గేదెను కోర్టుకు తీసుకురావడంతో కోర్టులో ఆసక్తికర చర్చ మొదలైంది.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations