యువతీ యువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించారు.
మధ్యప్రదేశ్ : ఇటీవల ప్రేమవివాహాలు కామన్ అయిపోయాయి. చాలామంది యువత తమకు నచ్చిన వారిని ఇంట్లో ఒప్పించి మరీ వివాహం చేసుకుంటున్నారు. అయితే ఇంకా చాలాచోట్ల ప్రేమ వివాహాన్ని తప్పుగానే భావిస్తున్నారు. ప్రేమవ్యవహారం తమ కుటుంబానికి తలవంపులుగా భావిస్తారు.
యువతీ యువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించారు.
కానీ, తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారతాయి. అటువంటి ఓ ఘటన madhyapradeshలోని హర్దా జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో ఓ తండ్రికి తన కుమార్తో మరో యువకునితో కనిపించింది.
దీంతో కోసం తట్టుకోలేని ఆ father రోడ్డు మీద బహిరంగంగా ఇద్దరిని పట్టుకుని ప్యాంట్ కు ఉన్న బెల్ట్ తీసి చావబాదాడు. తన కుమార్తె ఆ యువకునితో తిరుగుతూ తప్పుడుగా ప్రవర్తిస్తోందని భావించాడా తండ్రి.. అందుకే ఆగ్రహం తట్టుకోలేక ఇద్దరి మీదా దాడి చేశాడు.
ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. యువతి తండ్రి మీద యువకుడు స్థానిక తిమర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, తాగినమత్తులో అతడు విచక్షణను కోల్పోయాడు. కేవలం సాంబారు రుచిగా చేయలేదని కోపంతో ఊగిపోయి కన్న తల్లిని, తోబుట్టువుపై కాల్పులకు దిగాడు. తుపాకీతో కాల్చడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
కోపంతో ఉన్న అమ్మవారు ఆవహించిందని.. పూనకం వచ్చిన మహిళను కొట్టి చంపారు
వివరాల్లోకి వెళితే... Karnataka లోని సిద్దాపుర తాలుకా కుడగోడు గ్రామానికి చెందిన మంజునాథ్ పెద్ద తాగుబోతు. ఎప్పుడూ మద్యం మత్తులోనే వుంటూ కుటుంబసభ్యులతో గొడవపడుతుండేవాడు. ఇలా నిన్న(గురువారం) కూడా పీకలదాక మందు తాగి తూలుతూ ఇంటింకి చేరుకున్నాడు. అదే మత్తులో బోజనం చేస్తూ సాంబారు రుచిగా లేదంటూ తల్లి పార్వతి(42), సోదరి రమ్య(19)తో గొడవకు దిగాడు.
ఈ క్రమంలోనే తల్లి, సోదరిపై ఆగ్రహంతో ఊగిపోతూ విచక్షణను కోల్పోయిన మంజునాథ్ దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దనున్న నాటు తుపాకీతో తల్లి, సోదరిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరి శరీరంలోని బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు.
తుపాకీ కాల్పుల శబ్దం విని చుట్టపక్కల ఇళ్ళవారు వచ్చి చూసేసరికి పార్వతి, రమ్య మృతదేహాలు రక్తపు మడుగులో పడివున్నాయి. మంజునాథ్ చేతిలో తుపాకిని గమనించిన వారు భయంతో బయటకు పరుగుతీసారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లీ కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంజునాథ్ ను అరెస్ట్ చేయడమే కాదు కాల్పులకు తెగబడ్డ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.