నేడు కాంగ్రెస్ కీలకభేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం...

By AN TeluguFirst Published Oct 16, 2021, 10:31 AM IST
Highlights

ఢిల్లీలో అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీలో పంజాబ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్టానం మీద బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నేడు సమావేశం కానుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఢిల్లీలో అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీలో పంజాబ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్టానం మీద బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

cwc భేటీ గురించి పార్టీ సీనియర్ నేత Ghulam Nabi Azad అధిష్టానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం Sonia Gandhi కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే

పార్టీ పగ్గాలను Rahul Gandhiకు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంమీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపికకు మధ్యంతర ఎన్నికలకు బదులు.. పూర్తి స్తాయి సంస్థాగత ఎన్నికలే నిర్వహించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం మీద నేటి భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు పంజాబ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఈ సందర్బంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 

కాగా, అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు. ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ నెల 13వ తేదీన ఎయిమ్స్‌ చేరారు.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంటపాటు అక్కడేవున్న ఆయన... మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌ను ఆయన పరామర్శించారు. 

ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం మన్మోహన్ కు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మన్మోహన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని.. ఆయన ఆరోగ్యవంతంగా జీవించాలనీ ప్రార్థిస్తున్నాను' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

click me!