ఐఐటీ-బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్.. దర్శన్ గదిలో సూసైడ్ నోట్ .. అందులో ఏముంది? 

Published : Mar 27, 2023, 10:53 PM IST
ఐఐటీ-బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్.. దర్శన్ గదిలో సూసైడ్ నోట్ ..  అందులో ఏముంది? 

సారాంశం

18 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో ముంబై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్ లో మృతుడు దర్శన్ సోలంకిని తోటి విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించినట్లు ముంబై పోలీసు సిట్ తెలిపింది.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు: గత నెల ఐఐటీ బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మృతుడు దర్శన్ సోలంకి గదిలో సూసైడ్ నోట్ లభించిందని ముంబై పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. తన చావుకి తోటి విద్యార్థి అర్మాన్ కారమని, అతడు వేధిస్తున్నాడని , అర్మాన్‌ ఆత్మహత్యకు ప్రేరేపించాడని దర్శన్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడని ఈడీ విచారణలో తేలింది. దర్శన్ సోలంకి ఐఐటీ పొవాయ్ విద్యార్థి, అతను గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీస్ కమిషనర్ జాయింట్ కమిషనర్ క్రైమ్ లక్ష్మీ గౌతమ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.

ఆత్మహత్యకు కుల వ్యాఖ్యలే కారణమా?

దర్శన్ సోలంకి ఆత్మహత్యకు ఆయనపై కుల వ్యాఖ్యలే కారణమని సిట్ విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోలంకి గదిలోంచి ‘అర్మాన్‌ నన్ను చంపాడు’ అనే సూసైడ్‌ నోట్‌ దొరికిందని సిట్‌ వర్గాలు తెలిపాయి. ఆ విద్యార్థి పేరు అర్మాన్ ఇక్బాల్ ఖత్రి అని వర్గాలు తెలిపాయి. సోలంకీని బెదిరించి వేధించేవాడని ఆరోపించారు. ఆ రోజుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లు కూడా రికవరీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

విచారణ కమిటీ నివేదికలో ఏముందంటే..?

ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి ఆత్మహత్య కేసులో ఐఐటీ బాంబే ఏర్పాటు చేసిన విచారణ కమిటీ గతంలో మధ్యంతర నివేదికను సమర్పించింది. కుల వివక్ష కోణాన్ని 12 మంది సభ్యుల విచారణ కమిటీ తిరస్కరించింది. ఐఐటీ బాంబే ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికలో ఆత్మహత్యకు కారణం 'అకడమిక్ పనితీరు సరిగా ఉండటమే' అని పేర్కొంది.

అసలేం జరిగింది? 

గత నెల 18న (ఆదివారం) ఐఐటీ IIT విద్యార్థి దర్శన్ సోలంకి అనే విద్యార్థి.. పోవై క్యాంపస్‌లోని హాస్టల్ భవనంలోని ఏడవ అంతస్తు నుండి దూకినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా అతను మరణించాడు. అడ్మిషన్‌ తీసుకున్న మూడు నెలల్లోనే జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే క్యాంపస్‌లో ఎస్సీ విద్యార్థుల పట్ల చూపుతున్న వివక్షే అతడిని ఆత్మహత్యకు పురికొల్పిందని విద్యార్థి సంఘాలు అప్పట్లో ఆరోపించాయి.
 
ప్రధాని మోదీకి జిగ్నేష్ మేవానీ  లేఖ 

సిట్ విచారణకు డిమాండ్ చేస్తూ గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఐఐటీ బాంబేలో బీటెక్ కెమికల్ బ్రాంచ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి మరణానికి ఆత్మహత్యా? లేక హత్య? లేదా ర్యాగింగ్ సమయంలో కుల ఆధారిత వివక్ష వల్ల జరిగిందా ? అని నిర్ధారించడానికి సిట్ విచారణ అవసరమని మేవానీ అన్నారు. అయితే.. ఇన్‌స్టిట్యూట్‌లో ర్యాగింగ్, కుల పక్షపాతం ఆరోపణలను ఐఐటీ బాంబే అడ్మినిస్ట్రేషన్ తోసిపుచ్చింది.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!