దళిత మహిళకు చిత్రహింసలు.. ఆపై అత్యాచారం.. !!

Published : Jan 27, 2021, 09:13 AM IST
దళిత మహిళకు చిత్రహింసలు.. ఆపై అత్యాచారం.. !!

సారాంశం

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ దళిత మహిళను క్రూరంగా హింసించి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. నాగౌర్ జిల్లా గంగ్వాలో ముగ్గురు కిరాతకులు ఓ దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. గాజు సీసాను.. ఆమె సున్నిత భాగాల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. ఈ నెల 19న జరిగిన ఈ దుర్ఘటనపై బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు.  

నిందితుల బెదిరింపులకు భయపడి బాధితురాలు మొదట ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఎట్టకేలకు ఘటన జరిగిన 5 రోజులకు బాధితురాలి కుటుంబ సభ్యలు పర్భత్ సర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 

మూడ్రోజుల క్రితమే ఠాణాకు వచ్చామని.. కానీ బదిలీ అయిన కారణంగా ఫిర్యాదుని స్వీకరించలేనని స్టేషన్ ఇన్ ఛార్జి చెప్పాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?