రాజస్థాన్ లో ఘోరం.. ఇటుకలతో కొట్టి దళిత యువకుడి దారుణ హత్య..

Published : Mar 05, 2023, 09:53 AM IST
రాజస్థాన్ లో ఘోరం.. ఇటుకలతో కొట్టి దళిత యువకుడి దారుణ హత్య..

సారాంశం

దళిత యువకుడిని ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝలావర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ దళిత యువకుడిని గుర్తు తెలియని దుండగులు ఇటుకలతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశారు. అనంతరం బాధితుడు కళ్లను కూడా ధ్వంసం చేశారు. తరువాత అతడి శరీరాన్ని నగ్నంగా ఊరేగించారని ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది. ఈ ఘటన ఝలావర్ జిల్లా సునేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనోటియా రైమల్ గ్రామంలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

మృతుడిని 25 ఏళ్ల దుర్గేష్ మేఘ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండాపోయాడు. శనివారం ఉదయం గ్రామంలోని శిథిలాల మధ్య అతడి మృతదేహం లభించింది. దీంతో గ్రామంలో ఒక్క సారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 

2024లో యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తా: అఖిలేష్ యాద‌వ్

కాగా.. ఇప్పటి వరకు హత్యకు గల కారణాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ దారుణ హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హంతకులను పట్టుకునే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లి, తమ వద్దే ఉంచుకుంటామని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పట్టుబట్టారు.

డబుల్ ఇంజిన్ సర్కారుతో అవినీతి 20 నుంచి 40 శాతానికి పెరిగింది.. : బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

ఈ హత్యపై సమాచారం అందడంతో అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) చిరంజిలాల్ మీనా, పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రిచా తోమర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణ హత్యపై విచారణ ప్రారంభించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu