కర్ణాటకలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

Published : Mar 05, 2023, 08:50 AM IST
కర్ణాటకలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

సారాంశం

కర్ణాటకలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారంలో ఇటీవల ఏర్పాటు చేసిన బాయిలర్ ను సిబ్బంది పరీక్షిస్తుండగా అది పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. విజయపురలోని ప్రభుత్వ చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. దీంతో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ పేలుడులో ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడు బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

2024లో యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తా: అఖిలేష్ యాద‌వ్

ఈ కర్మాగారంలో ఇటీవల 220 టన్నుల సామర్థ్యం గల బాయిలర్ ను ఏర్పాటు చేశారు.  బాయిలర్ ను పరీక్షిస్తుండగా శనివారం ఒక్క సారిగా పేలిపోయినట్టు సమాచారం. దీంతో సమీపంలో పని చేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, ఇతర సిబ్బంది వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.

పెరుగుతున్న ఫ్లూ కేసులు: ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌.. ఐసీఎంఆర్ కీల‌క సూచ‌న‌లు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా అధికారి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. జిల్లాలోని బబ్లేశ్వర్ తాలూకాలోని కృష్ణా నగర్ ప్రాంతంలో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీలో రూ.51 కోట్లతో 220 టన్నుల సామర్థ్యం గల బాయిలర్ ను నిర్మించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

అదానీకి మద్దతుగా ఆస్ట్రేలియా మాజీ ప్రధాని.. ఆరోపణలన్నీ నిజాలు కావు కదా: హిండెన్‌బర్గ్ రిపోర్టుపై కామెంట్

ఇదిలా ఉండగా గత కర్ణాటకలోని బెంగళూరు జిల్లా జిగాని లింక్ రోడ్డులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ముగ్గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu